తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి. 2019 ఎన్నికల ఫలితాలు దగ్గరనుండి చంద్రబాబు కి దెబ్బ మీద దెబ్బ రాజకీయంగా తగులుతూనే ఉంది. జగన్ వేస్తున్న రాజకీయ ఎత్తుగడలకు చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటువంటి టైములో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయం భారీ వివాదాలకు దారి తీసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కెసిఆర్ జగన్ ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అని కొట్టిపారేశారు.

 

దీనిపై స్పందించడం కూడా అనవసరమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం లో బాబు స్పందించిన తీరు పై నెటిజెన్లు రాయలసీమ ప్రజలు మండిపడుతున్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతూ జగన్ సర్కార్ ఇటీవల జీవో జారీ చేయడం అందరికీ తెలిసిందే. ఈ విధంగా పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్థ్యం పెంచితే రాయలసీమకు లాభం చేకూర్చిన టు అవుతుంది. మరి ఇలాంటి విషయంలో నాటకం అని చంద్రబాబు ఎలా అంటారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. జగన్ ని రాజకీయంగా ఎలాగోలాగా దెబ్బ కొట్టాలని చూస్తున్న చంద్రబాబు తన వ్యాఖ్యల ద్వారా తానే ఇరకాటంలోకి పడిపోతున్నాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు. పోతిరెడ్డి ప్రాజెక్టుపై ఏపీలోని నీటిరంగ నిపుణులు, మేధావులు సైతం స్వాగతిస్తున్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా జగన్ నిర్ణయాన్ని సమర్థించారు.

 

కానీ చంద్రబాబు మాత్రం ఇది నాటకంగా కొట్టిపారేస్తున్నారు. దీంతో రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలు చంద్రబాబు పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాయలసీమ బాగుపడటం చంద్రబాబుకి  ఇష్టం లేదని ఇందులో నాటకం ఏముందని ఆయన చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు. ఆయన అధికారంలో ఉన్న టైంలో రాయలసీమలో చేసిన మంచి పని ఒకటి లేదు మరి ఇప్పుడు జగన్ చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ ఆయన పై వ్యతిరేకత చూపిస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే చంద్రబాబుకి బుల్లెట్ లాగా ఒకటి తర్వాత ఒకటి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. మూడు రాజధానుల విషయంలో అమరావతి కి జై కొట్టి కొన్ని ప్రాంతాలలో పొలిటికల్ డ్యామేజ్ చేసుకున్న చంద్రబాబు, పోతిరెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా ఆ విధంగా వ్యవహరించి డ్యామేజ్ చేసుకుంటున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: