వయసు మీద పడటం ప్రభావం ఏమో కానీ రాజకీయాలలో చాణిక్యుడు అని పేరు తెచ్చుకున్న చంద్రబాబు ప్లాన్స్ మొత్తం అట్టర్ ప్లాప్ అవ్వుతున్నాయి. ఒకానొకసమయంలో చంద్రబాబు వేసే ప్రతి ప్లాన్ కి ప్రత్యర్థులు బెంబేలెత్తే వారు. ఇరకాటంలో పడిపోయేవారు. అలా ఉండేవి చంద్రబాబు వ్యూహాలు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం తారుమారైంది. ఆయన ఎటువంటి ప్లాన్ వేసిన చివరాకరికి ఆయనకే డ్యామేజ్ తీసుకొస్తున్నాయి. దీంతో ఉన్న కొద్ది చంద్రబాబు పేరు ఢిల్లీలోనూ, లోకల్ రాజకీయాల్లోనూ తగ్గిపోతూ వస్తోంది. ఒకానొక సమయంలో చంద్రబాబు వస్తున్నారంటే ఢిల్లీలో నాయకులు మంచి గౌరవం ఇచ్చేవారు.

 

అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే చంద్రబాబు గౌరవం కోసం చేస్తున్న ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా మోడీని గత ఎన్నికలలో తీవ్రస్థాయిలో విమర్శించి చంద్రబాబు దారుణమైన పొలిటికల్ రాంగ్ స్టెప్ వేయడం జరిగింది. దీంతో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు మోడీ కనికరం అందుకోవటానికి మొదటి నుండి ఆయన చేస్తున్న ప్రతి ప్రకటన కు మద్దతు ఇస్తూనే ఉన్నాడు. ఇదిలావుంటే ఇటీవల కరోనా వైరస్ సమయంలో మోడీ వ్యవహరించిన తీరును ప్రతిసారి పొగుడుతూ చంద్రబాబు ఇటీవల మీడియా సమావేశాలు పెట్టడం జరిగింది.

 

లాక్ డౌన్ పుణ్యమాని చంద్రబాబు హైదరాబద్ లో సెల్ఫ్ క్వారైంటైన్ లో ఉంటూ రాస్తున్న లేఖలు తిరిగి తిరిగి ఆయన మెడకే చుట్టుకునే విధంగా ఉన్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు కేంద్రంలో ఉన్న నాయకులు ఎక్కువగా కరోనా వైరస్ పై ఫోకస్ పెట్టడం జరిగింది… ఇటువంటి తరుణంలో చంద్రబాబు గత ఎన్నికల టైంలో బిజెపికి జాతీయ స్థాయిలో కొంత డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేయడం అందరికి తెలిసిందే. కాగా ఆయనపై తాజాగా బీజేపీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇందువల్లే దీన్ని ఆసరా చేసుకుని జగన్ అమరావతి భూముల విషయంలో సిబిఐ దర్యాప్తు చంద్రబాబు పై చేయించడానికి ఇటీవల రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: