చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ వల్ల ఎక్కువగా నష్టపోయిన దేశం అగ్రరాజ్యం అమెరికా. గత ఏడాది నవంబర్ నెలలో చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ఆరు నెలల వ్యవధిలోనే భూమిపై దాదాపు 200 దేశాలకు పైగా వ్యాపించి ఉంది. ఈ వైరస్ వల్ల చాలా వరకు ఆర్ధిక నష్టం మరియు ప్రాణ నష్టం పలు దేశాలలో జరిగాయి. కరోనా వైరస్ చైనా యొక్క సృష్టి అని ముందు నుంచి చాలామంది వివిధ దేశాలకు చెందిన నాయకులు ఆరోపిస్తూనే ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముందు నుండి ఇది కరోనా వైరస్ కాదు చైనా వైరస్ అని మీడియా సమావేశం పెట్టి నప్పుడల్లా విమర్శలు చేస్తూనే ఉన్నాడు. ఇటువంటి సమయంలో అమెరికా.. చైనా దేశాల మధ్య వాతావరణం తీవ్రస్థాయిలో ఉద్రిక్తత స్థాయిలో ఉన్న సమయంలో అడ్డంగా బుక్కయింది WHO.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే అసలు కరోనా వైరస్ చైనాలో ఎలా పుట్టిందో అన్న దాని గురించి అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గత కొన్ని నెలల నుండి దర్యాప్తు చేపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా అమెరికా నిఘా సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ పై మరియు చైనాపై సంచలన ఆరోపణలు చేసింది. అది ఏమిటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ను చైనా బెదిరించింది అని తన తాజా నివేదికలో వెల్లడించింది.

 

ఇదే విషయం న్యూస్ వీక్ ప్రత్యేక కథనంలో తెలిపింది. చైనాలో జనవరిలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపించినప్పుడు చైనా ప్రపంచదేశాలకు తెలియచేయకుండా దాచిందన్నారు. వైరస్ విషయమై ప్రపంచ వ్యాప్త ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటిస్తే మేము అందించే సహకారాన్ని నిలిపేస్తాం అని 'WHO' ను చైనా భెదిరించినట్లు వివరించింది. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాలకు చైనాపై మరియు 'WHO' పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇద్దరూ కుట్రపూరితంగా వైరస్ నీ ప్రపంచం మీదికి బలంగా వదిలినట్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశ నాయకులు బలంగా నమ్ముతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: