కొన్ని ప్రాంతాలలో పోలీసు అధికారులు అధికారం ఉందని రెచ్చిపోయిన సంఘటనలు అనేకం. ఇలాంటి  సంఘటన బెంగళూరు లో చోటుచేసుకుంది. కొందరి వ్యాపారుల నుంచి బలవంతంగా వసూలు చేస్తున్న ఒక పోలీసు అధికారి పై కేసు నమోదు అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ పోలీసు అధికారికి సహకరించిన మరో ఇద్దరు ఇన్స్పెక్టర్ లపై కూడా పోలీసు అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. లాక్ డౌన్ సమయంలో సిగరెట్ వ్యాపారాల నుంచి సుమారు 1.75 కోట్ల రూపాయలను అక్రమంగా వసూలు చేసినట్లు బెంగళూరు సీసీబీ ఏసీపీ ప్రభుశంకర్, ఇన్స్పెక్టర్లు నిరంజన్, అజయ్ పై ఆరోపణలు రావడం జరిగింది. 

 


ఇకపోతే వీరు డిస్ట్రిబ్యూటర్ల నుంచి  బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అని ఉన్నతాధికారులకు సమాచారం  వచ్చింది. ఏకంగా పోలీస్ బాస్ అయిన డీజీపీ దృష్టికి వెళ్లడం ఇందులో విశేషం. ఇక ఆదేశాల మేరకు సదరు ఆరోపణపై సిసి, డిసిపి ప్రాథమిక విచారణ చేపట్టి కాటన్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు కావడంతో ఏసీపీతో సహా ఇద్దరు ఇన్స్పెక్టర్ల పై కేసు నమోదు చేయడం జరిగింది. 

 


అంతే కాకుండా ఆ పోలీసు అధికారుల నుంచి దాదాపు యాభై రెండు లక్షల రూపాయలు కూడా నగదు స్వాధీనం చేసుకున్నారు ఉన్నతాధికారులు. ఇక విచారణ జరిపిన ఉన్నతాధికారులు పోలీస్ వారికి నివేదిక అందజేయడం జరిగింది. ఇలా పోలీసు అధికారుల పైన కేసులు నమోదు అవ్వడం ఫీల్డ్ లో చర్చనీయాంశంగా మారింది అనే చెప్పాలి. ఇక ఆరోపణలు వచ్చిన అధికారులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ కాస్త కాలంలో ఇబ్బందులు పడుతున్న వ్యాపారులపై పోలీసులు ఇలా చేయడం ఎంతవరకు కరెక్టో అలా చేసిన వారికే తెలియాలి.  అయితే ఇలా పోలీసులపై కేసులను బనాయించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: