కరోనా వైరస్ సమయములో ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మోడీ మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్ సూచించిన ప్రతిపాదనలకు మోడీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపినట్లు ఇటీవల కరోనా వైరస్ భారీ ప్యాకేజీ విషయంలో ఆయన ప్రసంగించిన తీరు బట్టి బయటపడింది. ఈ ప్యాకేజీ ద్వారా జగన్ కోరినట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రధాని ప్రకటించడం గమనార్హం. అదేవిధంగా మోడీ తో వీడియో కాన్ఫరెన్స్ లో ఒక పక్క కరోనా వైరస్ తో పోరాడుతూనే ముందుకు సాగాలని జగన్ చెప్పిన పాయింట్స్ మళ్లీ మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో దేశ ప్రజలకు చెప్పడం నిజంగా గ్రేట్.

 

ఈ విధంగా జగన్ ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మోడీ. ఇప్పుడు ఇదే విధంగా రాష్ట్రాలలో ఉన్న బిజెపి నాయకులు కూడా చాలా వరకు జగన్ తీసుకున్న నిర్ణయాలకు ఓకే చెబుతున్నారు. పూర్తి మేటర్ లోకి వెళితే రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద హాట్ టాపిక్ అయిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ఏపీ బీజేపీ నేతలు జగన్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. తుగ్లక్ పరిపాలన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటాడు జగన్ అనే నాయకులు కూడా ఇప్పుడు జగన్ కి జై కొడుతున్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణ విషయం లో జగన్ ఇచ్చిన జీవో నీ ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మద్దతు తెలిపారు.

 

రాయలసీమలోని కరువు ప్రాంతాలకు, నీటి ఎద్దడి ప్రాంతాలకు నీరు ఇవ్వవలసి ఉందని, దీనిపై బిజెపి మొదటి నుంచి పోరాటం చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకుని చేస్తారో, లేక న్యాయపోరాటం చేస్తారో ..ఏమైనా చయండి ..వెనక్కి తగ్గకుండా దీనిన అమలు చేయాలని వైయస్ జగన్ ని కన్నా లక్ష్మీనారాయణ కోరారు. మొత్తంమీద చూసుకుంటే చాలా వరకు జగన్ పై బిజెపి నాయకుల నాలుకలు ఒక్కసారిగా మేల్కీ పడటానికి కారణం మోడీ అని దానికి ఇదే ఒక ప్రూఫ్ అని  అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: