ఇప్పుడే ఇప్పుడే రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతోంది, ఇక నిబంధనలు పూర్తిగా సడలింపులు  చేయవచ్చనే ఆలోచనలో కేంద్రం ఉంది.  ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులను వారి వారి సొంత రాష్ట్రాలకు  పంపించే విధంగా కసరత్తు మొదలుపెట్టింది.  దీనిలో భాగంగానే శ్రామికులతో పాటు దేశంలో అనేక ప్రాంతాలకు రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే 15 రైళ్ల ద్వారా కార్మికులను తరలించే  కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  వీటితోపాటు మరికొన్ని రైళ్లను నడపాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకుంది కేంద్రం. ఈ సందర్భంగా కొంతకాలం పాటు రైళ్లను నడపకపోవడమే మంచిది అనే అభిప్రాయాన్ని న్నీ రాష్ట్రాల సీఎం లు వ్యక్తం చేశారు. 

 

 ఈ విషయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి చెబుతూనే వస్తున్నారు. రైలు ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, వీరంతా అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే వారి అనుమానం నిజం చేస్తూ, ఇప్పుడు వలస కార్మికులు చాలామందికి కరోనా పాజిటివ్ అని తేలుతుండడంతో ఇప్పుడిప్పుడే వైరస్ కష్టాల నుంచి బయటపడుతున్న చాలా రాష్ట్రాల్లో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయింది. మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మర్కజ్ మత ప్రార్థనలు కు వెళ్లి వచ్చిన కేసులు ఎక్కువగా బయట పడ్డాయి.  వారిని గుర్తించడం కోసం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అష్టకష్టాలు పడ్డాయి. వారందరినీ ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందించారు.  ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణుగుతుంది అనుకున్న సమయంలో రైళ్ల ద్వారా వస్తున్న వలస కార్మికుల్లో కరోనా వైరస్ ఉన్న వారు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

 

IHG

 అయితే వీరందరినీ క్వారంటైన్ లో ఉంచి పరీక్షలు నిర్వహించడం వల్ల వైరస్ వ్యాప్తి మరింతమందికి సోకకుండా అడ్డుకట్ట పడింది.  వీరితో పాటు తమిళ నాడు కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన వారిలో చాలామందికి పాజిటివ్ అని తేలుతోంది.  అలాగే విదేశాల నుంచి వస్తున్న వారి లోనూ  పాజిటివ్ లక్షణాలు ఉన్నవారు ఎక్కువగా ఉండటం అన్ని రాష్ట్రాల్లోనూ ఆందోళన కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: