ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వల్ల అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాలు అన్ని కూడా తీవ్రంగా నష్టపోయాయి. ఎవరూ ఊహించని విధంగా ఈ వైరస్ రావడంతో చాలావరకు ప్రాణ నష్టం మరియు ఆర్ధిక నష్టం చేకూరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద మరియు మధ్యతరగతి ప్రజలు ఈ వైరస్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా అయితే ఈ వైరస్ వల్ల చాలా మూల్యం చెల్లించు కుంటుంది. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ పుట్టించింది చైనా దేశం అంటూ డోనాల్డ్ ట్రంప్ ఏకంగా కరోనా వైరస్ గురించి మాట్లాడిన ప్రతి సారి చైనా వైరస్ అని అభివర్ణిస్తూ వస్తున్నాడు. ఒక దురుద్దేశంతో చైనా దేశం ఈ కరోనా వైరస్ క్రియేట్ చేసిందని ముందునుండి డోనాల్డ్ ట్రంప్ కామెంట్ చేస్తూనే ఉన్నారు.

 

ఈ వైరస్ భారత దేశంలో ప్రవేశించి ఆర్థికంగా గానూ ప్రాణ నష్టం గాను చాలా డామేజ్ చేసింది. ఇటువంటి సమయంలో కరోనా వైరస్ పుట్టుక గురించి ప్రపంచంలో ఉన్న దేశాలు చైనా పై కరోనా పై ఓ టైపు పాయింట్ లో ఆరోపణలు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు చైనా కలిసి కుట్రపూరితంగా ఈ వైరస్ ని ప్రపంచం పైకి దురుద్దేశంతో వదిలారని అనేక ఆరోపణలు ఆరోపించడం జరిగింది. అయితే ఈ విషయంలో ఇండియా సరికొత్త లాజిక్ తో ఆరోపణలు చేస్తుంది.

 

అదెలా అంటే ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, క‌రోనాను ఆర్టిఫిషియ‌ల్ వైర‌స్ గా అభివ‌ర్ణించారు. అది ఏదో స‌హ‌జంగా మ‌నుషుల మీద‌కు రాలేద‌ని ఆయ‌న ఒక టీవీ చాన‌ల్ ఇంట‌ర్వ్యూలో అభిప్రాయ‌ప‌డ‌టం గ‌మ‌నార్హం. చైనా  యే క‌రోనాను సృష్టించార‌నే అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. మొత్తంమీద చూసుకుంటే కరోనా వైరస్ చైనా సృష్టి అనే అభిప్రాయాన్ని నితిన్ గడ్కరీ తేల్చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: