దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కరోనా విజృంభణతో భారత్ తో పాటు ఇతర దేశాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. పలు దేశాల అధ్యక్షులు కరోనా మహమ్మారి ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కరోనాతో కలిసి జీవించాల్సి ఉందని వ్యాఖ్యలు చేసింది. 
 
తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కొత్తరకం దగ్గుబిళ్లలను అందుబాటులోకి తెచ్చారు. ఈ దగ్గు బిళ్లలను నోటిలో వేసుకుంటే లాలాజలం బరువు పెరుగుతుంది. బయటకు వెళ్లేముందు ఎవరైనా ఈ దగ్గుబిళ్లలు వేసుకుంటే తుమ్మినా, దగ్గినా తుంపరలు నేలపై పడిపోతాయి. ప్రతి ఒక్కరూ మాస్క్ ను ఉపయోగించి ఈ బిళ్లలను ఉపయోగిస్తే 2 అడుగుల భౌతిక దూరం సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. 
 
శాస్త్రవేత్తలు హై స్పీడ్ కెమెరాలను ఉపయోగించి తుంపర్లు గాల్లోకి ఎగిరే తీరును పరిశీలించారు. ఈ దగ్గు బిళ్లలు వాడిన వారిలో తుంపర్లు ఎక్కువ దూరం వెళ్లకపోవడాన్ని గమనించారు. చాలా ప్రాంతాలలో ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడం సాధ్యం కాదని అలాంటి ప్రాంతాల్లో ఈ బిళ్లలను ఉపయోగించడం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 78,000 దాటింది. ఇప్పటివరకు 26,235 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా 2,549 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఈరోజు 36 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో కరోనా కేసుల సంఖ్య 2,100కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 48 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. తెలంగాణలో నిన్న 41 కొత్త కేసులు నమోదు కాగా కరోనా బాధితుల సంఖ్య 1367కు కేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: