రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జల వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. మొన్నటి వరకూ కరోనా వైరస్ గురించి వార్తలు రాగా ప్రస్తుతం పోతిరెడ్డి ప్రాజెక్టు గురించి తెలుగు మీడియా ఫోకస్ ఎక్కువ పెట్టింది. అయితే ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం నోరు మెదపడం లేదు. చాలావరకు సైలెంట్ గా ఉంటూ వ్యవహరిస్తున్నారు. ఇటువంటి టైములో చంద్రబాబు ఎటువంటి పాయింట్ లేవనెత్తకుండా ఉండట్టని గట్టిగా టార్గెట్ చేసి విజయసాయిరెడ్డి తన రేంజ్ లో ఇరగదీశాడు. విమర్శల మీద విమర్శలు చేస్తూ కృష్ణా జలాల వివాదంపై చంద్రబాబు వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని రెచ్చిపోయారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని తరలించే జీవో 203 పై స్పందన తెలియజేయాలని చంద్రబాబుని విజయసాయి రెడ్డి నిలదీశారు.

 

అడ్డమైన విషయాలలో మాట్లాడే చంద్రబాబు ఈ విషయంపై ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. ఈనెల 5వ తారీఖున జీవో విడుదలవ్వగా ఇప్పటిదాకా చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని అసలు మీరు రాయలసీమ బిడ్డేనా..? మీరు ఏపీవారేనా..? అని చంద్రబాబును విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇటీవల జగన్ సర్కార్ ఏపీ పునర్విభజన చట్టం ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుండి 3 టీఎంసీల నీటి తరలించేందుకు ప్రయత్నిస్తోందని, దీని కోసమే 203 జీవో జారీ చేసిందని లేఖలో తెలిపింది.

 

ఈ జీవోపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా న్యాయస్థానానికి వెళ్తున్నట్లు కూడా ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయమని కేసీఆర్ సర్కార్ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇటువంటి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా నిలదీశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: