జగన్ అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సర కాలంలో జగన్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. అలాగే పలు నిర్ణయాలపై జగన్ కు హైకోర్టులో కూడా ఎదురుదెబ్బలు తగిలాయి. ఉదాహరణకు రాజధాని అంశం, ఇంగ్లీష్ మీడియం, గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.

 

కొన్ని అంశాలు ఇంకా కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వంపై మరో పిటిషన్ హైకోర్టులో పడింది. ఇళ్ల స్థలాలో అవినీతి జరిగిందంటూ పిటిషన్ దాఖలైంది. భూములను అధిక ధరకు కొనుగోలు చేశారని సదరు పిటిషనర్  కోర్టుకు తెలిపారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసి.. తదుపరి విచారణను వాయిదా వేసింది.  అయితే ఈ పిటిషన్ తూర్పు గోదావరి జిల్లా బురిగపూడిలో ప్రభుత్వం 600 ఎకరాలను కొనుగోలుకు సంబంధించింది.

 

కానీ వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కోసమని చెప్పి, భూములు సేకరణ మొదలు పెట్టిన దగ్గర నుంచి టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. లక్ష కూడా విలువ కూడా చేయని భూములని కోటి పైనే కొని వైసీపీ నేతలు ప్రభుత్వ సొమ్ముని మింగేస్తున్నారని అంటున్నారు. దీనికి సంబంధించి పలు భూములకు సంబంధించిన వివరాలు కూడా చెబుతున్నారు.

 

ఇదే సమయంలో కాకినాడ ప్రాంతంలో మడ అడవులు కూడా నరికి ఇళ్ల స్థలాలు కింద ఇవ్వాలని చూస్తున్నారని, దాని వల్ల పర్యావరణంతో పాటు, అక్కడ ఇళ్ళు కట్టుకునే వారికీ ముప్పు వాటిల్లనుందని టీడీపీ వాళ్ళు చెబుతున్నారు. అయితే ఇన్ని ఆరోపణల మధ్య హైకోర్టులో పిటిషన్ రావడంతో, దీనిపై విచారణ జరిగి, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు వచ్చింది. ఇక ఆ పిటిషన్ వెనుక టీడీపీ హస్తం ఉందని వైసీపీ భావిస్తోంది. అందుకనే దీనిపై పక్కా ఆధారాలతో కౌంటర్ దాఖలు చేసి టీడీపీకి గట్టి షాక్ ఇవ్వాలని చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: