గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వంలో యనమల రామకృష్ణుడు ఆర్ధిక మంత్రిగా చేసిన విషయం తెలిసిందే. ఆయన వేసిన లెక్కల్లో బొక్కలు ప్రజలకు అర్ధమయ్యే అనుకుంటా ప్రజలు టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా యనమల ఆర్ధిక విషయాలపైనే ఎక్కువ ఫోకస్ చేసి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

 

తాజాగా కూడా జగన్ ప్రభుత్వం లక్ష్యంగా ఊహించని విమర్శలు చేసారు. కేంద్రం వేల కోట్లు రాష్ట్రానికి విడుదల చేసిందని, ఇప్పటి వరకు సామాన్యులకు ఏమీ చేరలేదని, రాష్ట్రంలో అభివృద్ధీ జరగలేదన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసిన నిధుల వ్యయాన్ని తనిఖీ చేయడానికి కేంద్రానికి ఇదే సరైన సమయమని, వివిధ నివేదికల ద్వారా నిధుల్లో అవినీతి, దుర్వినియోగం జరిగినట్టు తెలుస్తుందన్నారు.

 

ఇక ఇక్కడ జగన్ ని ఇబ్బంది పెట్టడం టీడీపీ వల్ల కావడం లేదు. అందుకనే యనమల కేంద్రాన్ని జగన్ పై ఉసిగొలిపి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అయితే ఇక్కడొక విషయం మాట్లాడుకోవాలి, జగన్ అధికారంలోకి వచ్చాక కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చిన సందర్భాలు లేవు. రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటానే సరిగా అందినట్లు కూడా లేదు. అయితే కరోనా సమయంలో కొన్ని ప్రత్యేక నిధులు విడుదల చేసింది.

 

ఎంత విడుదల చేసిన విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అయితే రాలేదు. కానీ నిధులు విషయంలో కేంద్రం ఎప్పుడు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. అయితే గత టీడీపీ ప్రభుత్వాన్ని మాత్రం కేంద్రం అనేక సార్లు ప్రశ్నిస్తూనే వచ్చింది. అసలు నిధులు దుర్వినియోగం చేస్తున్నారని రాష్ట్ర, కేంద్ర బీజేపీ నేతలు చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇక బాబు అండ్ బ్యాచ్ కూడా లెక్కలు సరిగా చెప్పకుండా తప్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకనే గతంలో తమని ఇబ్బంది పెట్టారనే చెప్పి, ఇప్పుడు యనమల..జగన్ ప్రభుత్వాన్ని కేంద్రం ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: