ఏపీలో అన్ని ప్రతిపక్ష పార్టీలు జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఎప్పుడు ఏదోరకంగా విమర్శలు చేస్తూనే వస్తుంది. ఇక టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐలు కుడా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని వస్తున్నారు.

 

ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ పై విమర్శలు చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్ర అధ్యక్ష పదవిని కాపాడుకునేందుకు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసి, తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కూడా కొరియా నుంచి వచ్చిన కరోనా టెస్టింగ్ కిట్లలో వైసీపీ కమిషన్ కొట్టేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసారు.

 

ఇక తాజాగా కూడా అభివృద్ధి చేసిన ప్రభుత్వం భూములని అమ్మి, ఆదాయ వనరులని సమకూర్చుకోవడంలో భాగంగా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ బిల్డ్ ఏపీపై కూడా కన్నా రాజకీయం మొదలుపెట్టారు. టీడీపీ దీనిపై ఎలాగో రాజకీయం మొదలుపెట్టింది కాబట్టి, తాను కూడా ఏ మాత్రం తగ్గకూడదని చెప్పి, విమర్శలు స్టార్ట్ చేసారు. కాకపోతే ఈ విమర్శలు చేసే విషయంలో జగన్ ని చంద్రబాబుతో పోలుస్తూ మాట్లాడారు.

 

మిషన్ బిల్డ్ ఏపీ ప్రభుత్వ భూములను వేలం వేయాలని నిర్ణయించడంపై కన్నా అభ్యంతరం వ్యక్తం చేశారు. నవరత్నాల కోసం భూములు అమ్మి నిధులు సమీకరించాలని అనుకోవడం సరి కాదని, చంద్రబాబు చేసిన పొరపాటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అయితే గతంలో చంద్రబాబు అభివృద్ధి పేరిట చాలా విలువైన భూములని పలు కార్పొరేట్ సంస్థలకు అప్పగించారు.

 

కానీ జగన్ చేస్తున్న పని మాత్రం అది కాదు. విలువైన భూములని అమ్మి, మళ్ళీ ఆ సొమ్ముని ప్రజలకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. ఇక దీని వల్ల ఎవరికీ నష్టం ఉండదు, ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. ప్రజలకు మేలు కూడా జరుగుతుంది. కానీ కన్నా అవేమి పట్టించుకోకుండా రాజకీయం కోసం విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: