వైరస్ వల్ల ప్రపంచం విలవిలలాడుతుంటే మరోపక్క కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వాలు బ్లీచింగ్ పౌడర్ పేరుతో అక్రమాలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ఎక్కడికక్కడ బ్లీచింగ్ పౌడర్ తో మున్సిపల్ సిబ్బందితో శుభ్రపరిచే కార్యక్రమం ప్రభుత్వం  చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. అయితే ఈ బ్లీచింగ్ పౌడర్ స్థానంలో మామూలు సున్నా ని కలిపేసి కొంతమంది అధికారులు అధికార పార్టీ నేతలకు లాభం చేకూర్చలని క్వాలిటీ చూసుకోకుండా కొనుగోలు చేస్తున్నారని దాదాపు 70 కోట్ల మేర బ్లీచింగ్ పౌడర్ స్కామ్ జరిగిందని ప్రచారం గట్టిగ జరుగుతోంది. గుంటూరు జిల్లా కేంద్రంగా ఈ బ్లీచింగ్‌ పౌడర్‌ స్కామ్ బయటపడటంతో అందరినీ విస్మయానికి గురి చేసింది.

 

 

పూర్తి వివరాల్లోకి వెళితే  అసలు బ్లీచింగ్‌ పౌడర్‌ తయారు చేసే పరిశ్రమ ఏదీ లేకుండానే గుంటూరు జిల్లాకి చెందిన ఓ సంస్థ నుంచి పెద్దయెత్తున బ్లీచింగ్‌ పౌడర్ ‌ని కొనుగోలుకు అధికారులు ఆర్డర్లు ఇచ్చేశారట. ఓ జిల్లాలో ఉన్నతాధికారి ఒకరు బ్లీచింగ్‌ పౌడర్‌లో నాణ్యత గురించి పరిశీలించడంతో బాగోతం వెలుగుచూసిందని అంటున్నారు. మొత్తం నాలుగు జిల్లాలకు ఇప్పటికే ఈ ఫేక్‌ బ్లీచింగ్‌ పౌడర్‌ సరఫరా అయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది. 

 

 

వైరస్ ఇళ్లలో రాకుండా వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే పనిచేస్తుందని రుజువైన గాని, ఫేక్‌ బ్లీచింగ్‌ పౌడర్ ‌ని వినియోగించాల్సి రావడమే దురదృష్టకరం. ఇదిలా ఉంటే ఈ స్కామ్ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటువంటి కీలకమైన సమయంలో వైరస్ ని అడ్డంపెట్టుకుని అధికార పార్టీ నేతలు చేస్తున్నట్టు వస్తున్న స్కామ్ వార్తలు విని ఏపీ ప్రజలు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరోపక్క నిజమేనా లేకపోతే ఈ వార్త సృష్టించారా అని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: