దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. చాలా నెలల నుంచే ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్న భారత్ కరోనా ధాటికి ఆర్థికంగా చితికిపోయింది. ప్రధాన నగరాలన్నీ కేంద్రం రెడ్ జోన్లుగా ప్రకటించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆర్థికంగా భారత్ ఇబ్బందులు పడుతున్న తరుణంలో మోదీ 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. 
 
 
ప్రధాని మోదీ ప్యాకేజీని ప్రకటించిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీ వివరాలను చెబుతారని అన్నారు. నిర్మలా సీతారామన్ నిన్న నాలుగు గంటల సమయంలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ప్రయోజనం చేకూరే విధంగా ప్యాకేజీని ప్రకటించారు. ఈరోజు సన్నకారు రైతులకు, వలస కార్మికులకు ప్రయోజనం చేకూరేలా కీలక ప్రకటనలు చేశారు. అయితే సోషల్ మీడియాలో నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ టైమ్ గురించి చర్చ జరుగుతోంది. 
 
నిర్మలా సీతారామన్ నాలుగు గంటలకే ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రత్యేక కారణం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా అదే సమయానికి కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రెస్ మీట్ నిర్వహించి దేశంలో కొత్త కేసుల నమోదు, మృతుల సంఖ్య, ఇతర వివరాలను ఇచ్చేవారు. ప్రస్తుతం అదే సమయంలో నిర్మలా సీతారామన్ టీవీల్లో ప్రత్యక్షమవుతున్నారు. 
 
కేంద్ర ప్రభుత్వ ఆలోచనా తీరులో మార్పు వల్లే ఇలా జరుగుతోందని సమాచారం. మొదట ప్రధాని నరేంద్ర మోదీ కరోనాపై పోరులో మనుషుల ప్రాణాలు అతి ముఖ్యమని వ్యాఖ్యలు చేశారు. తాజాగా జాతినుద్దేశించి ప్రసంగించిన సమయంలో కరోనాతో కలిసి బ్రతకడం తప్పనిసరి అని అన్నారు. మోదీ ప్రతిరోజూ 4 గంటల సమయంలో ప్యాకేజీని ప్రకటించేలా చేసి లవ్ అగర్వాల్ కు షాక్ ఇచ్చారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: