నగరి ఎమ్మెల్యే రోజా కి అటు టాలీవుడ్ ఇటు రాజకీయాల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓవైపు బుల్లితెరపై నవ్వులు తో పువ్వులు పూయిస్తున్న రోజా అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కీలక నేతగా  కొనసాగుతూ.. ఓ వైపు  రాజకీయాలు  మరో వైపు బుల్లి తెరపై తన కెరీర్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. ఓవైపు నగిరి ఎమ్మెల్యే గా  ఒక నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటూ ప్రజలందరికీ మేలు చేసే విధంగా పనులు చేస్తూ ముందుకు సాగుతున్న రోజా... మరోవైపు మంత్రి హోదా ఉండే  ఏపీఐఐసీ చైర్మన్ పదవిలో కొనసాగుతోంది. 

 


 ఇక రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది రోజా. జబర్దస్త్ లో జడ్జిగా కొనసాగుతోంది రోజా... తన నవ్వులతోనే... జబర్దస్త్ షో కి ఎంతగానో అట్రాక్షన్ తెచ్చి షో కి  సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో ఎంతో మంది ప్రముఖులు ఇంటికి పరిమితం అయిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది ఫిట్నెస్పై దృష్టి పెడుతున్నారు. 

 


 ఇక ప్రస్తుతం రోజా కూడా ఇంటికే పరిమితమైంది. జబర్దస్త్ షూటింగ్ కాస్త నిలిచిపోవడం... రాజకీయంగా ఎలాంటి సమావేశాలు జరగకపోవడంతో .. ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే రోజా ప్రస్తుతం కాస్త సమయం దొరకడం తో ఫిట్నెస్పై దృష్టి పెట్టింది . ఎమ్మెల్యే రోజా ఫిట్నెస్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక ప్రస్తుతం ఖాళీ సమయం దొరకడం తో తన ఫిట్నెస్ పెంచుకోవడానికి రోజా ఎంతగానో కష్టపడుతోంది . ఏకంగా డంబుల్స్ చేతపట్టి వర్కౌట్స్ చేస్తుంది రోజా.ఎమ్మెల్యే రోజా ఫిట్నెస్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: