జనసేన భారతీయ జనతా పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే.. పొత్తు పెట్టుకుని రెండు పార్టీలు కలిసి  ముందుకు సాగుదాం  అంటూ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు పార్టీలు కలిసి ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చేసరికి జనసేన పార్టీ అటు టీడీపీ తో కూడా పలు ప్రాంతాలలో పొత్తు పెట్టుకున్నట్లు వార్తలు  వచ్చాయి. అంతేకాకుండా కొంతమంది నేతలు టీడీపీ జనసేన పార్టీకి చెందిన జెండాలను వేసుకుని బహిరంగంగానే ప్రచారం చేసారు. 

 


 అయితే ప్రస్తుతం జనసేన బీజేపీ పార్టీలో సంయుక్తంగానే కలిసి ముందుకు నడుస్తున్నాయా అనే ప్రశ్న మాత్రం కొంత మంది జనసేన నేతల్లో  కలుగుతోంది. అయితే జనసేన పార్టీ క్రమ క్రమంగా బలం పుంజుకుంటున్న విషయం తెలుసిందే . ఈ నేపథ్యంలో అటు స్థానిక నేతలు కొంతమంది టీడీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీతో పొత్తు కొనసాగించడం చేస్తే నేతలు కూడా అయోమయ పరిస్థితి ఉన్నారని.. ఇలాంటిది పార్టీ బలోపేతానికి దెబ్బతీస్తుంది అంటున్నారు విశ్లేషకులు. అటూ ఇటూ కాకుండా పూర్తిగా ఏదో ఒక పార్టీ వైపు ఉంటే జనసేన కు వచ్చే ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు. 

 

 ముఖ్యంగా టిడిపి రాజకీయ వ్యూహం ప్రకారమే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుందని.. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతారహితంగా బిజెపి పొత్తు విషయంలో ముందుకు సాగుతున్నారు. అదే పొత్తుని  కొనసాగించి స్థానిక నేతలను  కూడా సమన్వయం చేస్తూ ఎలాంటి పరిస్థితిలోనైనా బీజేపీతో మాత్రమే పొత్తు  ఉండాలని టీడీపీ తో  పెట్టుకోవద్దని దిశానిర్దేశం చేస్తే  అది జనసేన పార్టీ కి కలిసొచ్చే అంశం అని అంటున్నారు విశ్లేషకులు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల సమయం ఉన్నందున ఈ లోగా బిజెపి జనసేన పార్టీ లు సంయుక్తంగా ముందుకు నడుస్తున్నాం ప్రజల్లో నమ్మకం కలిగిస్తే జనసేన పార్టీకి ఇది ఎంతగానో కలిసి వస్తుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: