ఇప్పటికే చాల మంది వలస కార్మికులు పనులు లేక వెళ్ళటానికి రవాణా వ్యవస్థ లేక దేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లకు చేరుకోవడానికి వేల కిలోమీటర్లు కాలినడక చేపట్టారు. నడుస్తూ నడుస్తూ చాలా మంది మధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చూశాం.

 

వలస కూలీలు స్వస్థలాలకు చేరే వరకు వారికి నీళ్లు, ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖలు రాసి కీలక సూచనలు ఇచ్చిన విషయం తెలిసిందే.

 

దీనితో కేంద్రం వలస కార్మికుల కోసం స్పెషల్ ట్రైన్ లా ద్వారా వారిని తమ గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల మోడీ కరోనా వైరస్ కారణంగా 20 లక్షల కోట్ల స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. సందర్భంగా ప్యాకేజీలో వలస కార్మికులకు కూడా అండగా నిలవాలని కేంద్రం నిర్ణయించింది. దాదాపు రూ.1,000 కోట్లు వలస కార్మికుల సంక్షేమం కోసం కేటాయించింది.

 

వలస కార్మికుల్ని అన్ని రకాలుగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నాం అని ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేద కార్మికుల కోసం 3 కోట్ల మాస్కులను అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.

 

"వలస కార్మికులకు మూడు పూటలా భోజనం అందించేందుకు అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. సహాయ శిబిరాల ఏర్పాటుకు, భోజన ఏర్పాట్లకు రూ.11 వేల కోట్లు కేటాయించాం. వలస కార్మికులు ఎక్కడ ఉంటే అక్కడే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉపాధి పొందవచ్చు. వలస కార్మికులందరికీ ఉపాధి కల్పిస్తాం," అని  నిర్మలా సీతారామన్ తెలిపారు.

 

"వలస కార్మికులకు వచ్చే రెండు నెలల పాటు ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తాం. జాతీయ ఆహార భద్రతా పథకంలో నమోదు చేసుకోనివారు, రేషన్ కార్డు లేని వలస కార్మికులూ కూడా దీనికి అర్హులే. ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం లేదా గోధుమలు కుటుంబానికి కేజీ సెనగలు అందిస్తాం. అందుకోసం అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీనికోసం రూ.3,500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాం," అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: