ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుంది ఈ మహమ్మారి వైరస్... సునామి కంటే ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది. రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్న వారి సంఖ్య పెరిగి పోవడంతో పాటు మహమ్మారి కారణంగా మృత్యువు ఒడిలో చేరుతున్న వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరిగి పోతూనే ఉంది. ఎన్నో  కోట్లు వెచ్చించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ... ఎన్ని చర్యలు చేపట్టినా ఎలాంటి ఉపయోగం లేకుండాపోతుంది. వెరసి ప్రపంచం మొత్తం ప్రమాదకర స్థితిలో కి వెళ్ళిపోతుంది. 

 

 

 ప్రపంచ దేశాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ఈ మహమ్మారి వైరస్ మాత్రం ప్రపంచ దేశాల ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. రోజురోజుకు ఈ మహమ్మారి ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రజలను ప్రాణభయంతో పరుగులు పెట్టేలా చేస్తోంది. అయితే తాజాగా కేవలం 24 గంటల సమయంలోనే దాదాపు లక్ష కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం  ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. కాగా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య 45 లక్షలు దాటిపోయింది. అలాగే ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య కూడా మూడు లక్షలు దాటిపోయింది. 

 

 

 ముఖ్యంగా అగ్ర రాజ్యాలైన అమెరికా యుకె బ్రెజిల్ లాంటి దేశాల్లో అయితే మరణ మృదంగం వాయిస్తున్న ఈ కరోనా వైరస్... తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరి విలయతాండవం చేస్తుంది. ఇక ప్రపంచ దేశాలకు పెద్దన్న లాంటి అమెరికా దేశంలో అయితే ప్రతి రోజూ 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.  24 గంటల సమయంలో అమెరికాలో 26,398 కొత్త కేసులు నమోదు కావడం అక్కడ ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక బ్రెజిల్ లో నిన్న ఒకేరోజు 13,761 ఒక కొత్త కేసులు నమోదు కాగా రహస్యాలు 9994 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటలీ జర్మనీ ఫ్రాన్స్ తదితర దేశాల్లో వందల్లో  కేసులు నమోదవుతున్నాయి... అటు భారతదేశంలో కూడా రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగి పోతుంది.భారతదేశంలో 24 గంటల్లో 3942  కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య లో కూడా అమెరికా దేశమే టాప్ ప్లేస్ లో నిలిచింది. రోజూ వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: