ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ మనిషి జీవితాన్ని తలకిందులు చేస్తూ అతలాకుతలం చేస్తుంది. ఎంతో మందికి తమ ప్రియమైన వారిని దూరం చేస్తూ తీరని శోకాన్ని తమ కుటుంబంలో నింపుతోంది. ఇప్పటికే ఎన్నో విషాదాలకు  కారణమైంది ఈ మహమ్మార రక్కసి . తాజాగా జరిగిన ఘటన అందరిని కలిసి వేస్తూ కంటతడి పెట్టిస్తోంది. కరోనా  వైరస్ సోకి భార్య చనిపోయింది అన్న బాధతో భర్త కూడా రోజుల వ్యవధిలోనే చనిపోవడం కుటుంబాన్ని మొత్తం విషాదంలో నెట్టిసింది.  ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని మేరీలాండ్ కు చెందిన లారెన్స్ నోక్స్, మెనెట్టే   ఇద్దరిదీ ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. కాగా లారెన్స్ నర్సింగ్ హోమ్ ఆస్పత్రిలో మెయిల్ నర్స్ గా పని చేస్తున్నాడు. ఇక ఇద్దరు దంపతులు ఇరుగుపొరుగు వారితో కూడా ప్రేమగా ఉండడం తో వీరితో అందరికీ ఎంతో ప్రేమ ఆప్యాయత పెరిగిపోయింది. 

 

 

 అయితే ప్రస్తుతం అమెరికాలో కరోనా  వైరస్ చూస్తుండగానే పంజా విసురుతుంది. ఎంతో మందిని బలితీసుకుంది అన్న  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లారెన్స్ పనిచేస్తున్న ఆసుపత్రిలోనూ కరోనా  రోగులకు  చికిత్స అందించారు. కరోనా  రోగులకు చికిత్స అందిస్తున్న వార్డుకు లారెన్స్ నర్సింగ్ అసిస్టెంట్ గా పని చేశారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు సేవ చేశారు  ఈ క్రమంలోనే ఆయన కూడా ప్రమాదవశాత్తు వైరస్ సోకింది. వైరస్ సోకిన కారణంగా ఆరోగ్య పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లిపోయారు లారెన్స్. ఇక 11 రోజుల తర్వాత కోమా  నుంచి బయటకు వచ్చారు. బయటకు రాగానే అతను  అడిగిన ప్రశ్న నా భార్య ఎక్కడ... ఈ ప్రశ్నకు వైద్యులు సమాధానం చెప్పలేకపోయారు. సతమతమయ్యారు. 

 

 

 లారెన్స్ పదేపదే తన భార్య గురించి అడగడంతో నిజం చెప్పేశారు వైద్యులు. లారెన్స్ ఆసుపత్రిలో చేరిన కొద్ది రోజులకే అతని భార్య కూడా కరోనా  పాజిటివ్ నిర్ధారణ కాగా కొన్ని రోజుల్లో ఆరోగ్యం విషమించి నిద్రలోనే కన్నుమూసిందని తెలపడంతో లారెన్స్ గుండె ముక్కలయింది .ప్రాణం కంటే ఎక్కువ  ప్రేమించిన భార్య లేదని తెలుసుకుని ఆరోగ్య పరిస్థితి మళ్ళీ క్షీణించింది. దీంతో ఆయన వైద్యం కూడా తీసుకొనని .. చికిత్స నిలిపివేయాలని డాక్టర్లను అభ్యర్థించాడు. లారెన్స్ ఇంటికి వెళ్లిపోయాడు. తన కారణంగానే తన భార్యకు వైరస్ సోకింది అని భావించి మరింత కుంగిపోయాడు. కుటుంబ సభ్యులకు పిలిచి  ఆస్తులు వస్తువులను ఏం చేయాలో  చెప్పాడు.మరునాడే  ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఎంతో మందిని కలిచి వేస్తూ కన్నీరు పెట్టిస్తోంది. వీరిద్దరి మృతికి సంతాపం తెలిపిన వారి పిల్లలు, స్థానికులు  లారెన్స్, మెన్నట్టే  దంపతులు ఒకరినొకరు విడిచి ఉండలేరూ  అని అందుకే ఇద్దరూ ఒకే చోటకు వెళ్లిపోయారు అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: