క‌రోనా కోర‌లు చాచిన వేళ ప్ర‌తి ఒక్క‌రూ ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. స్కూళ్ళు, కాలేజీలు ఇలా అన్ని ప‌రిశ్ర‌మ‌లు కూడా మూత ప‌డ్డాయి. ఇక కొన్ని పెద్ద స్కూల్స్ అయితే మాత్రం కాస్త వీడియో క్లాసులు పెట్టి సిల‌బ‌స్‌లు పూర్తి చేస్తున్నారు. మామూలు చిన్నా చిత‌క ప్రైవేట్ స్కూళ్ళ‌లో అదీ లేదు. దాంతో పిల్ల‌లు ఇంట్లోనే ఉంటూ తెగ బోర్ ఫీల‌యిపోతున్నారు. దాంతో వాళ్ళ‌కు ఉన్న‌వి కేవ‌లం మూడే మూడు ఆప్ష‌న్లు. ఒక‌టి ఆడుకోవ‌డం, లేదంటే టీవీ చూడ‌టం, లేదా చ‌దువుకోవ‌డం. ఇక చ‌దువంటే మాత్రం చాలా మంది పిల్ల‌లు బ‌ద్ధ‌కిస్తా ఉంటారు. కొంత మంది పిల్ల‌లు త‌ల్లిదండ్రుల బ‌ల‌వంతం మీద పుస్త‌కాలు తీసిన‌ప్ప‌టికీ మరికొంత‌మంది ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని చూస్తూ ఉంటారు. ఇక ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఇళ్ళ‌ల్లోంచి బ‌య‌ట‌కు వెళ్ళి ఫ్రెండ్స్‌తో క‌లిసి ఆడుకునే ప‌రిస్థితి అయితే లేదు. కేవ‌లం ఇంట్లోనే ఉండి ఏదో ఇండోర్ గేమ్స్ లాంటివి ఆడుకోవాలి. వారి తోబుట్ట‌వుల‌తో, లేదా కాసేపు త‌ల్లిదండ్రుల‌తో ఇలా ఆడుకుంటూ టైమ్ స్పెండ్ చేయాలి.

 

మ‌రి కొంత‌మంది తోబుట్టువులు త‌మ‌కంటే చిన్న వాళ్ళ‌ను ఆడించుకోకుండా ఆట‌ప‌ట్టిస్తూ లేదంటే వాళ్ళ‌కి ఆడ‌టం రాకో వాళ్ళ‌తో టైమ్ స్పెండ్ చేయ‌రు దీంతో చిన్న బుచ్చుకున్న ఓ ఎనిమిదేళ్ళ కుర్రాడు ఎంత‌ప‌ని చేశాడంటే...కేరళ రాష్ట్రానికి చెందిన  8 ఏళ్ల బాలుడు పోలీస్ స్టేష‌న్‌కి వెళ్ళాడు. స్టేషన్‌లో ఉన్న ఒక పోలీసు అధికారి వద్దకు వెళ్లిన ఆ బాలుడు ఏమి చెప్పాడంటే ఒక కంప్లైంట్ ఇవ్వ‌డానికి  వచ్చాన‌ని  తెలియజేశాడు. తన అక్కతో పాటు ఆమె నలుగురు స్నేహితురాళ్లను అరెస్ట్‌ చేయాలంటూ కంప్లైంట్‌లో పేర్కొన్నాడు. మొత్తం అయిదుగురును పోలీసులు అరెస్ట్‌ చేయాల్సిందిగా కోరాడు. అయితే ఇంత‌కీ ఆ బాలుడి ఇచ్చిన  ఫిర్యాదు వింటే ఎవ‌రైనా స‌రే నోరు వెళ్లబెట్టాల్సిందే. చివ‌రికి  పోలీసులు కూడా అదే ప‌ని చేశారు. ఇక పోలీసులు అసలు కారణం ఏంటని తెలుసుకుని నవ్వలేక సచ్చారు అనుకోండి.

 

ఇంతకు ఆ బాలుడు చెప్పిన కారణం ఏంటంటే… గత కొన్ని రోజులుగా తన అక్కతో పాటు ఆమె స్నేహితురాళ్లు ఆటలు ఆడుకుంటూ త‌న‌ను పట్టించుకోవడం లేద‌ని చెప్పాడు. లూడో, దాగుడు మూతలు, బ్యాడ్మింటన్‌ ఏది ఆడినా కూడా వారు త‌న‌ను కలవనివ్వడం లేద‌ని. ఏమన్నా అంటే అబ్బాయిలతో ఆడుకో అంటున్నార‌ని తెలిపాడు. నాకు అబ్బాయిలు స్నేహితులు ఎవరు లేరు. మీతో ఆడిపించుకోండి అంటూ ఎంత కోరినా కూడా వారు పట్టించుకోలేద‌ని తెలిపాడు. అందుకే వారిని అరెస్ట్‌ చేయండి అంటూ బాలుడు విజ్ఞప్తి చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ రోజుల్లో పిల్ల‌లు ఎంత ఫాస్ట్‌గా ఉంటున్నారంటే పిల్ల‌లు కాదు పిడుగులు అన్న‌ట్లుంది ప్ర‌స్తుత ప‌రిస్థితులు.

మరింత సమాచారం తెలుసుకోండి: