ఏపీ సీఎం వైఎస్ . జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాజా నిర్ణ‌యాల‌తో పార్టీల‌కు అతీతంగా ప‌లువురు ఆయ‌న‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంస‌ల జల్లు కురిపిస్తున్నారు. జ‌గ‌న్ గ‌త వారం రోజులుగా తీసుకున్న నిర్ణ‌యాలు చూస్తే వైజాగ్ లో జ‌రిగిన ఎల్జీ పాలిమ‌ర్స్ గ్యాస్ లీకేజ్ ప్ర‌మాదంలో బాధితుల‌కు క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ప్ర‌మాద ప‌రిహారం ప్ర‌క‌టించారు. ఈ ప‌రిహారం ప్ర‌క‌టించ‌డంతో పాటు రెండు రోజుల‌కే ప‌రిహారం బాధితుల‌కు అందేలా చేశారు. మొత్తం మూడు రోజుల్లో ప్ర‌జ‌లు అంద‌రూ ఈ ప్ర‌మాదం విష‌యాన్ని మ‌ర్చిపోయి ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీ అయిపోయారు. ప్ర‌మాదంలో బాధ‌త కుటుంబాల‌కు ఈ కంపెనీలోనే ఉద్యోగం ఇవ్వాల‌ని కూడా జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు.

 

ఇక అటు క‌రోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో చిక్కుకు పోయిన ఏపీ ప్ర‌జ‌ల‌ను ఏపీకి తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌త్యేక స‌ర్వీసులు వాడుతున్నారు. ప్ర‌త్యేక స‌ర్వీసుల్లో వ‌స్తోన్న వారు ముందుగా స్పంద‌న పోర్ట‌ల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌దుపాయం కూడా క‌ల్పించారు. ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి బ‌స్సుల్లో ప్ర‌యాణించే అవ‌కాశం ఉంది. ఇలా హైద‌రాబాద్ నుంచి ఏపీకి వ‌చ్చేందుకు మొత్తం 13 వేల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వ‌చ్చే రెండు, మూడు రోజుల్లో వీరంతా ఏపీలోని త‌మ స్వ‌స్థ‌లాల‌కు వ‌స్తారు.

 

ఇక బెంగ‌ళూరు, చెన్నై నుంచి వ‌చ్చే వారికి కూడా ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డుపుతారు. ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారికి కూడా ఈ పాస్‌లు జారీ చేసి వారిని స్వ‌స్థ‌లాల‌కు తీసుకు రానున్నారు. ఇక తాజాగా పోతిరెడ్డి పాడు విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో నేప‌థ్యంలో జాతీయ పార్టీలు సైతం రెండు రాష్ట్రాల‌కు వేర్వేరుగా డెసిష‌న్లు తీసుకున్నాయి. అయితే చంద్ర‌బాబు మాత్రం ఈ విష‌యంలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో సీమ జిల్లాల‌కు చెందిన రైతులు అంతా జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక యువ‌కులు సైతం జ‌గ‌న్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంసిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: