వరంగల్ కు  చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో అందిరికి తెలిసిన విషయమే. ఆర్కిటెక్చర్ విద్యార్థి అయిన రితికేశ్వరి ఆత్మహత్య పై ఎన్నో అనుమానాలు ఇంకా ఎన్నో ప్రశ్నలు మరెన్నో వివాదాలు కూడా తెర మీదికి వచ్చాయి. ముఖ్యంగా విద్యార్థిని రితికేశ్వరి ఆత్మహత్యకు సీనియర్ విద్యార్థులతోపాటు కాలేజీ ప్రిన్సిపల్ ముఖ్య కారణం అనే ఆరోపణలు వచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రితికేశ్వర్ కి సీనియర్ విద్యార్థులైన... నాగలక్ష్మి,  చరణ్ నాయక్, ఎం శ్రీనివాస్... తీవ్రస్థాయిలో ర్యాగింగ్ కి పాల్పడటం.. అంటే కాకుండా ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబురావు కూడా ఇందుకు సహకరించారని ఆరోపణలు అప్పట్లో వచ్చాయి.

 

 

 ఇక ఆ తర్వాత ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. ఇక వీరి పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయ్యాక ఫోక్స్ స్పెషల్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే 2015 జూలై 14 రితికేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ యువతి ఆత్మహత్య చేసుకున్న నాటికి మృతురాలు మేజర్ అని... పోక్సో  కోర్టు చార్జిషీట్లు వెనక్కు పంపించింది. ఈ  ఉత్తర్వులను సవాల్ చేస్తూ మృతురాలి తండ్రి 2017లో హైకోర్టును ఆశ్రయించారు. ఆత్మహత్య చేసుకున్న  నాటికి తన కూతురు మైనర్ అంటూ కొన్ని ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. దీనిపై విచారణ జరిపించాలని స్పెషల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. 

 

 

 ఇక తాజాగా ఇన్నేళ్ల తర్వాత మరోసారి రితికేశ్వరి ఆత్మ హత్య కేసును తెరమీదికి తెచ్చింది ఏపీ హైకోర్టు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రితికేశ్వరి ఆత్మహత్య కేసును  పోక్సో చట్టం కింద పరిగణించాలి  అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసు విషయంలో పోలీసులు జారీ చేసిన చార్జిషీట్ను ఆరు నెలల్లోపు తేల్చాలి అంటూ పోక్సో  స్పెషల్ కోర్టు కు  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో పోలీసులు సిద్ధం చేసిన చార్జిషీట్ను గుంటూరులోని పోక్సో  స్పెషల్ కోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని  హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. లైంగిక వేధింపులకు గురైన సమయంలో సదరు యువతి మైనర్ అంటూ తెలిపిన హైకోర్టు దీనిపై సత్వరంగా విచారణ జరిపించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: