మామూలుగా అయితే ఏదైనా వింత జంతువు కనిపించింది అంటే భయపడిపోతూ ఉంటాం. మామూలుగా మనం  రోజు తిరిగే ప్రాంతాలను ఆ వింత జంతువు కనిపిస్తే అటువైపుగా వెళ్లడానికి కూడా భయపడుతూ ఉంటాము. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. గోల్కొండలో ఓ వింత జంతువు కలకలం సృష్టించింది. అక్కడి ప్రజలందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేసింది. కానీ ఆ తర్వాత ఆ వింత జంతువు ఏమిటో తెలిసి ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆ వింత జంట ఏంటో  కాదు అడవి పిల్లి. ఆ అడవి పిల్లిని  చూసి నల్ల చిరుత ఏమో అని స్థానికులు అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

 

 వివరాల్లోకి వెళితే... గోల్కొండ నూరాని మసీదుపై బుధవారం రాత్రి చిరుత పోలికలు ఉన్న ఒక నల్లటి జంతువు కనిపించింది. అనంతరం అది మసీదు పక్కనే ఉన్న ఇళ్ల పై నుంచి దూకుతూ వెళ్లడం మరింత కలకలం సృష్టించింది. జంతువు నల్ల చిరుతపులి లా  ఉండడంతో స్థానిక ప్రజలు అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంటి తలుపులు కిటికీలు మూసుకున్నారు. ఇక ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు... అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఓవైపు పోలీసులు మరో వైపు అటవీశాఖ అధికారులు ఇంకోవైపు జూ అధికారులు వింత జంతువును  పట్టుకునేందుకు ప్రయత్నించగా దాదాపు మూడు గంటల పాటు అటు ఇటు తిరుగుతూ అధికారులకు పట్టుబడకుండా తప్పించుకుంది.

 

 

 గురువారం ఉదయం ఎట్టకేలకు చాకచక్యంగా వింత జంతువును పట్టుకున్నారు పోలీసులు. అయితే అది నల్ల చిరుత కాదని... అడవిలో సంచరించే పిల్లి అని అటవీశాఖ అధికారులు తెలపడంతో స్థానిక ప్రజలు అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.అయితే ఇది గోల్కొండ కోట ప్రహరీ గోడ ఆనుకొని ఉన్న చెట్ల నుంచి జనావాసాల్లోకి వచ్చి ఉంటుంది అని అటవీ  శాఖ అధికారులు తెలిపారు. కాగా ఇది పిల్లలలోని మరనాంగీ  జాతికి చెందిన పిల్లి  అని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అసదుల్లా చెప్పుకొచ్చారు. కాగా దానిని జూ అధికారులు వెంటనే జూ కి  తరలించారు. అందులో ఇది సురక్షితంగా ఉంటుంది అంటూ తెలిపారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: