చట్టం తప్పుచేసిన ఒక వ్యక్తిని శిక్షించాలంటే దానికి సరైన సాక్ష్యాధారాలు కావాలి.. కానీ లోకంలో ఎందరో తప్పులు చేసి, ఎలాంటి శిక్షలు లేకుండా తప్పించుకుంటున్నారు.. వారు చేసే దారుణాలకు, కారణాలు వెతికే వారు లేరు.. అందుకే దర్జాగా తప్పుచేసిన తప్పించుకోవచ్చు అనే ధీమాతో ఎందరో నేరాలకు పాల్పడుతున్నారు.. ఇలాంటి నేరస్దుల విషయంలో చట్టాలు వేగవంతంగా పని చేస్తే, తప్పు చేయాలంటే భయపడే రోజులు తప్పక వస్తాయనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి..

 

 

ఇకపోతే తప్పు చేసిన నేరస్దున్ని శిక్షించే సమయంలో మానవ హక్కులు అంటు కొందరు బయలు దేరుతారు.. మరి తప్పులు జరిగినప్పుడు వెంటనే స్పందించకుండా వీరంత ఎక్కడ ఉంటారో అర్ధం కాదు.. మొత్తానికి మనదేశంలో న్యాయాన్ని రక్షించడం కంటే అన్యాయానికే రక్షణ ఎక్కువ అనే విషయం క్షుణంగా అర్ధం అవుతుంది.. లేకుంటే మనుషులను జంతువుల కంటే దారుణంగా చంపిన గాని, విచారణ పేరుతో సంవత్సరాల తరబడి జైళ్ళో భోగాలు అనుభవిస్తూ దర్జాగా బ్రతకడం ఏంటో అసలే అర్ధం కాదు.. ఇకపోతే ఒక యువతి కేవలం రూ.20 నోటు కోసం కక్కుర్తిడి, అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని దారుణంగా చంపేసింది..

 

 

కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో, జాగనూర గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది.. ఆ వివరాలు చూస్తే.. దివ్య (4) అనే చిన్నారి బిస్కెట్లు కొనుక్కునెందుకు తల్లి దగ్గర రూ.20 తీసుకుని కిరాణ కొట్టుకు వెళ్లుతుండగా చూసిన పూజ అనే యువతి పాప దగ్గరి నుంచి రూ.20 లాక్కుంది. అయితే ఆ డబ్బుల కోసం పాప గట్టిగా ఏడ్వటం మొదలు పెట్టగా, గాబరా పడిన ఆ యువతి విషయం బయటకు తెలిసిపోతుందని, భయపడి వెంటనే సమీపంలోని బావిలోకి తోసి, అక్కడి నుంచి పారిపోయింది..

 

 

ఇక బయటకు వెళ్ళిన పాప ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడి, పాప కోసం వెతుకుండగా బావిలో నిర్జీవంగా కనిపించింది. వెంటనే వారు పాపను బావి నుంచి బయటకు తీశారు. కానీ అప్పటికే దివ్య ప్రాణాలు కోల్పోయింది. ఇక పాపకోసం ఆ తల్లిదండ్రుల రోదన అక్కడున్న ప్రతివారిని కదిలించింది.. కేవలం రూ.20 కోసం ఆ చిన్నారిని అతి క్రూరంగా చంపడం స్థానికంగా సంచలనమైంది. కాగా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టి, నిందితురాలైన పూజను అరెస్టు చేశారు..   

మరింత సమాచారం తెలుసుకోండి: