ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నారైలకు చుక్కలు చూపిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ తీరుతో ఎన్నారైలు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..  కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో విదేశాల్లో భారతీయులు చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ చేపట్టింది. విదేశాల్లో ఉన్న భారతీయులను విమానాలతో పాటు షిప్‌ల‌తో తీసుకొస్తోంది. అయితే భార‌తీయులు ఇండియాకి చేరుకున్న తర్వాత వారిని క్వారంటైన్‌లో ఉంచుతోంది. ఇక్క‌డ వారిని సుమారు 14రోజుల‌పాటు ఉంచి, క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసి నెగ‌టివ్ వ‌చ్చిన వారిని స్వ‌స్థ‌లాల‌కు పంపుతోంది. అయితే.. క్వారంటైన్ పూర్తి చేసుకుని సొంతూళ్ల‌కు వెళ్లేవారికి ఉత్త‌ర ప్ర‌దేశ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా క్యాబ్‌లు, బ‌స్సు స‌ర్వీసుల‌కు అందుబాటులో ఉంచింది. ఇక్క‌డి బాగానే ఉందిగానీ.. చార్జీల రూపంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది.

 

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యూపీలోని నోయిడా, ఘజియాబాద్ తో పాటు సుమారు 250 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతాల‌కు వెళ్ల‌డానికి.. ఏకంగా రూ.10,000 చార్జీలను వసూలు చేస్తోంది. కార్ల మోడ‌ల్‌ను బ‌ట్టి రూ.10వేల నుంచి రూ.12వేల వ‌ర‌కు వ‌సూలు చేస్తోంది. నిజానికి సాధార‌ణ స‌య‌మ‌యాల్లో ఈ చార్జి కేవ‌లం రూ.800మాత్ర‌మే ఉంటుంది. ఇక 26 సీట్లున్న బస్సులో వంద కిలోమీటర్ల దూరానికి వెయ్యి రూపాయలు వసూలు చేస్తోంది. ఈ చార్జీల‌తో ఎన్నారైలు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌ను తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శిస్తున్నారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో మ‌రీ ఇంత‌లా చార్జీలు వ‌సూలు చేస్తారా..? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఏకంగా ప‌దిరెట్లు చార్జీలు పెంచితే ఎలా..? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో వ‌ల‌స కార్మికులను మాత్రం ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉచితంగా వ‌సూలు చేస్తోంది. దీంతో వ‌ల‌స కార్మికుల సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: