2011 వ సంవత్సరంలో విడుదలైన పవన్ కళ్యాణ్ మూవీ పంజా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల మందుకు వచ్చి అందర్నీ నిరాశపరిచింది. సినిమా కథ బాగో లేకపోయినా ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ మేనరిజం, స్టైల్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కన్నుల విందుగా మారాయి. అయితే 2011వ సంవత్సరంలో నిర్వహించిన పంజా మూవీ ఆడియో ఫంక్షన్ లో ఆల్ ఇండియాలో ఐఐటీ జేఈఈ మెయిన్ పరీక్షలో మొదటి ర్యాంకు సంపాదించిన పృథ్వీరాజ్ ఇమ్మడి హాజరు కాగా... అతనిని పవన్ కళ్యాణ్ సత్కరించాడు. పవన్ కళ్యాణ్ కు పృథ్వీరాజ్ బీభత్సమైన అభిమాని. తను 2017 వ సంవత్సరం లో ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో 24వ ర్యాంకు సాధించాడు.


ద్వారకా తిరుమల గ్రామానికి చెందిన పృథ్వీరాజు తల్లిదండ్రులకు ఒక బంగారపు షాపు ఉంది. ఐఐటీ-జేఈఈ లో ఫస్ట్ ర్యాంకు తెచ్చుకున్న పృథ్వీరాజ్ ఐఐటి బొంబాయిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు. 2015 సంవత్సరంలో తన ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసుకున్న పృథ్వీరాజ్ కు సామ్సంగ్(samsung) సంస్థలో ఏడాదికి రూ.70 లక్షల జీతంతో జాబ్ ఆఫర్ రావడంతో తాను ఆ ఉద్యోగం లో జాయిన్ అయ్యాడు. కానీ ఐఏఎస్ కావాలి అనుకున్న తను 2016 సంవత్సరంలో తన జాబ్ కి రిజైన్ చేసి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యాడు. ఆ క్రమంలో కూడా అతనికి సంవత్సరానికి కోటి రూపాయల పారితోషికం ఇస్తామని ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి కానీ తాను కలెక్టర్ కావాలని పట్టుబట్టి 14 గంటలపాటు చదివి ఇండియా మొత్తంలో 24 ర్యాంకును సంపాదించి సంచలనం సృష్టించాడు.


అప్పుడు ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం పంజా ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకున్న పృథ్వీరాజ్ ఇమ్మడి నిన్న అనగా మే 14వ తేదీన మదనపల్లెకు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరూ పృథ్వీరాజ్ పవన్ మధ్య కొనసాగిన సన్నివేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరూ పృధ్వీరాజ్ ని స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఏదో ఒకటి సాధించాలని హితవుపలికారు. పంజా నిర్మాత నీలిమ తిరుమల శెట్టి కూడా పృథ్వీరాజ్ కి అభినందనలు తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: