ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం క్రమక్రమంగా కొన్ని సడలింపులు పెంచుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మద్యం షాపులు తెరుచుకోవడం సహా పలు దుకాణ సముదాయాలు కూడా తెరుచుకున్నాయి. ఇక ప్రారంభం కావాల్సిందల్లా ఆర్టీసీ సదుపాయం. బస్సులు ఎప్పుడెప్పుడు నడుస్తాయ అని  అటు  ప్రజలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రజా రవాణాను పున ప్రారంభించేందుకు ప్రభుత్వం కూడా వేగంగా ఏర్పాటు చేస్తోంది. అయితే ప్రస్తుతం సడలింపు ఇచ్చినప్పటికీ ప్రజలు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఎటు వెళ్ళలేని పరిస్థితి. 

 

 ఒకవేళ బస్సు సౌకర్యం కల్పిస్తే కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్యం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని ఎవరూ ఊహించని విధంగా ఉంది. ఈ రోడ్డు రవాణా పునరుద్ధరించే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది  అనేదానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేకంగా ప్రయాణికుల కోసం సీట్లు కుదించినట్లు సమాచారం. మూడో దశలో లాక్ డౌన్  ముగిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సులు రోడ్ ఎక్కనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బస్సులో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు. 

 


 బస్సులో ప్రతీ ప్రయాణికుడికి భౌతిక దూరం ఉండేలా చేస్తుంది... హ్యాండ్ శానిటైసర్లు  సైతం అందుబాటులో ఉంచనున్నారు. దీనికి సంబంధించి సూపర్ లగ్జరీ బస్సులు ఉండే సెట్టింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కేవలం సూపర్ లగ్జరీ బస్సు లోనే కాకుండా అల్ట్రా  డీలక్స్,  ఎక్స్ప్రెస్,  పల్లె వెలుగు సిటీ ఎక్స్ప్రెస్, సిటీ సర్వీస్ లో కూడా ఇలాంటి సీట్ల కుదింపు ఉంటుంది అని తెలుస్తుంది.సూపర్ లగ్జరీ(36 సీట్లు): 24 సీట్లకు కుదింపు
అల్ట్రా డీలక్స్(40 సీట్లు): 27 సీట్లకు కుదింపు
ఎక్స్‌ప్రెస్‌(50 సీట్లు): 30 సీట్లకు కుదింపు
పల్లెవెలుగు(60 సీట్లు): 36 సీట్లకు కుదింపు
సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌(45 సీట్లు): 23 సీట్లకు కుదింపు
సిటీ ఆర్డినరీ(46 సీట్లు): 24 సీట్లకు కుదింపు

మరింత సమాచారం తెలుసుకోండి: