దేశంలో కరోనా వైరస్ ఏ రకంగా విజృంభిస్తూ వస్తుందో అందరికీ తెలిసిందే. కరోనా కి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదు.. అందు కోసం మనం జాగ్రత్తలు తీసుకొని దరి చేరకుండా చూసుకోవాల్సిందే అంటున్నారు. కరోనా వ్యాధి సోకకుండా భౌతిక దూరం పాటించాలి.. ముఖానికి ఎప్పుడూ మాస్క్ ధరించాలి.. తుమ్మినా, దగ్గినా వారి దగ్గరలో ఉండకూండా పక్కకు వెళ్లిపోవాలి.  ఒకవేళ కరోనా వ్యాధి సోకినట్లైతే వారిని క్వారంటైన్ లో ఉంచాలని చెబుతున్నారు. గత కొన్నిరోజులుగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దాంతో వలస కార్మికులు ఎక్కడిక్కడే బందీ అయ్యారు.  ఈ మద్య వలస కార్మికులకు స్వేచ్ఛ లభించింది. తమ స్వస్థలాలకు వెళ్లేందుక కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  కానీ ఇక్కడే ఇప్పుడు వలస కార్మికులకు కొత్త చిక్కులొచ్చిపడ్డాయి.

 అయితే, పెద్ద సంఖ్యలో వలస కార్మికులు వస్తుండడంతో ఆయా రాష్ట్రాలు కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ స్వస్థలాలకు  వేల సంఖ్యలో కార్మికులు వస్తుండడంతో వారికి ఎక్కడ క్వారంటైన్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వాలకు ఓ సమస్యగా మారింది. కానీ..  ఉత్తరాఖండ్ రాష్ట్రం మాత్రం ఆ సమస్యకు చక్కని పరిష్కారం కనుగొంది. రాష్ట్రంలో కొన్నిచోట్ల ప్రజలు ఖాళీ చేసిన గ్రామాలను వలస కార్మికులకు క్వారంటైన్లుగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది.

 

కొంత కాలంగా కొన్ని గ్రామాలు పూర్తిగా పడావు పడ్డాయి.. అక్కడ ఎవరూ నివాసం ఉండటం లేదు. వాటిని దెయ్యాల గ్రామాలుగా పిలుస్తారు.. ఇప్పుడు అవే కొంతమంది ఆశాదీపాలుగా కనిపిస్తున్నాయి. సాధారణ గ్రామాల్లో క్వారంటైన్ ఏర్పాటు చేస్తే వైరస్ వ్యాపించే ముప్పు ఉన్న దృష్ట్యా, ఈ దెయ్యాల గ్రామాల్లో అయితే ఎవరికీ సమస్య ఉండదని ఉత్తరాఖండ్ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  వాటిలో చాలా గ్రామాల్లో సదుపాయాలు కల్పించారు. ఇళ్లను శుభ్రం చేయించి క్వారంటైన్ కోసం వచ్చే వలస కార్మికులకు అనువుగా తీర్చిదిద్దారు.

మరింత సమాచారం తెలుసుకోండి: