వారిద్దరూ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు. కానీ చివరికి వారి కుటుంబ సభ్యులు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. అక్కడితో వారి ప్రేమకు ముగింపు పడింది.ఇంకేముంది ఆ యువతికి వేరే వాళ్ళని చూసి పెళ్లి చేశారు. ఇది ఇలా ఉండగా.. కథ ముగిసింది అనుకుంటున్నారా...? లేదు లాక్ డౌన్ తో ఒకరి ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ మొదలయ్యింది. ఆ ప్రేమ చివరికి అక్రమ సంబంధానికి దారి తీయడం జరిగింది.

 
ఈ ఘటనపై పూర్తి వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా కమలాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన రాజ్ కుమార్.. అదే గ్రామానికి చెందిన రమ్య 10 సంవత్సరాల కింద నుంచి ప్రేమించుకున్నారు. కానీ ఇరువురి కుటుంబ పెద్దలు వారి పెళ్లికి నిరాకరించడం జరిగింది. ఈ తరుణంలోనే రమ్యకు వేరే యువకునితో వివాహం జరిపించారు పెద్దలు. ఇక ఆ యువతి భర్త మద్యానికి బానిసై పది నెలల కిందట చనిపోవడం జరిగింది. దీనితో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె పుట్టింటిలో జీవనం కొనసాగిస్తుంది. 


ఇక రమ్య వివాహం అయిపోయిన తర్వాత రాజ్ కుమార్ గోవిందరావుపేట మండలంలో ఒక అమ్మాయిని వివాహం చేసుకొని హైదరాబాదులో క్యాబ్ డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఇక లాక్ డౌన్ కారణంతో రాజ్ కుమార్ తన స్వగ్రామానికి వచ్చాడు. ఈ తరుణంలోనే రాజ్ కుమార్ రమ్య తో అక్రమ సంబంధం కొనసాగించడం జరిగింది. ఈ విషయంపై పది రోజుల కిందటే రాజ్ కుమార్ కు ఆయన భార్యతో గొడవ జరిగి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. 

 

 

ఇక తీవ్ర మనస్తాపానికి గురైన రాజ్ కుమార్ రమ్య తో కలిసి ఆటోలో నడిగూడెం మండలానికి వెళ్ళాడు. వారిద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ కుంటలో వారి ఇద్దరి శవాలు బయట పడ్డాయి. సంఘటన తెలుసుకున్న పోలీసు అధికారులు మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీరిద్దరు కూడా కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: