కరోనా వైరస్‌ పుట్టినిల్లు అయిన చైనాపై అంతర్జాతీయంగా రోజురోజుకు పెరుగుతోంది. చైనాలోని వుహాన్ నగరంలో ఉన్న వైరాలజీ ల్యాబ్ నుంచే క‌రోనా వైరస్ పుట్టిందని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరి కొందరు వైద్య నిపుణులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ విషయంలో ప్రధానంగా చైనా అమెరికాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కరోనా వైరస్ గురించి చైనా కావాలనే బయటి ప్రపంచానికి చెప్పలేదని, అందువల్లే నేడు ప్రపంచమంతా ఈ మహమ్మారి బారిన పడి విలవిలలాడుతోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఒకానొక దశలో కరోనా వైర‌స్‌ను చైనీస్ వైరస్ అని కూడా డోనాల్డ్ ట్రంప్ అన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం డోనాల్డ్ ట్రంప్‌ను తప్పుబట్టింది. వైరస్ లకు దేశాలు, సరిహద్దు ప్రాంతాలు అన్న తేడా ఉండదని, కరోనా వైరస్ ను ప్రకృతి సృష్టించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ చెప్పారు.

 

అయినా కూడా చైనా పై మాత్రం అంతర్జాతీయంగా ఆరోపణలు ఆగడం లేదు. తాజాగా అమెరికాకు చెందిన సీఐఏ ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్,‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ మధ్య జరిగిన సంభాషణ‌కు సంబంధించిన‌ కీలక అంశాన్ని వెల్లడించింది. చైనాలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న జనవరిలోనే ఈ సంభాషణ  జరిగినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ఇప్పుడే కరోనా వైరస్ గురించి ప్రపంచానికి చెప్పొద్దని, అది తమపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఒకవేళ మీరు ప్రపంచానికి చెబితే మాత్రం నిధులను ఆపేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ ను చైనా అధినేత బెదిరించినట్లు నివేదికలో పేర్కొన‌డం కలకలం రేపుతోంది. ఇప్పటికే జర్మనీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. చైనా అధ్యక్షుడు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ మధ్య జరిగిన సంభాషణ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని జర్మనీ చెబుతోంది. ఈ నేపథ్యంలో చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: