ప్రజలకు అవసరమైతే నాయకులను సైతం పక్కన పెట్టడం జరుగుతుందని తనలో ఉన్న సరికొత్త కోణాన్ని పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో జగన్ చూపించాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా వరకు జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి స్నేహంగానే ఉంటున్నారు. గతంలో చంద్రబాబుతో ఉన్నట్టుగా కాకుండా కేసిఆర్ -జగన్ తో కలసి అడుగులు వేస్తున్నారు. అయినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల లాభాల విషయంలో లబ్ధి పొందే విషయంలో ఎక్కడా రాజీ పడకుండా జగన్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచడం లో డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయం తీసుకోవటం తో జగన్ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. వెనుకబడిపోయిన రాయలసీమ ప్రాంతాలకు ఈ నిర్ణయం ఎంతగానో లాభాన్ని చేకూరుస్తుంది.

 

తాజాగా ప్రస్తుతం ఈ నిర్ణయంతో జగన్కి పొలిటికల్ మైలేజ్ విపరీతంగా వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు పరిపాలన లో 40 ఏళ్ల అనుభవం ఉన్న ఏ ఒక్క పని ప్రజలకు ఉపయోగపడేది జరగలేదని ఇద్దరి పరిపాలన గురించి ఏపీ జనాలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు పాలనలో పట్టిసీమ ప్రాజెక్టు తప్పించి చెప్పుకోవడానికి చేపట్టిన మరో కొత్త ప్రాజెక్టు ఏమీ లేదని పైగా నిధులు లేవంటూ ఎన్నికల సమయంలో ప్రకటించిన సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేక పోయారని బాబు పై ప్రజలు విమర్శలు చేస్తున్నారు.

 

ప్రజలకు లాభం చేకూరే విషయంలో  కేసీఆర్ లాంటి నేతనే ఢీకొనేందుకు జగన్ రెడీ అవటం ఇటు ప్రతిపక్షాలకు అటు మరియు తెలంగాణ రాజకీయ నేతలకు కూడా ఒక్కసారిగా దిమ్మతిరిగిపోయే విధంగా పరిస్థితి మారిందని అంటున్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని నలభై వేల క్యూసెక్కుల నుంచి ఎనభై వేల క్యూసెక్కులకు పెంచగలిగితే రాయలసీమలో జగన్ ను కొట్టే వారే లేరంటున్నారు. చంద్రబాబు హయాంలో అవకాశం ఉన్నా చేయలేకపోవడంతో ప్రస్తుతం జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో రాయలసీమలో జగన్ కి ఇంకా తిరుగుండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: