లాక్ డౌన్ దేశంలో కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించి దాదాపు 50 రోజులు దాటిపోయాయి. ఈ లాక్ డౌన్ వాళ్ళ ప్రజలు ప్రైవేటు రంగాలతో పాటు గా ప్రభుత్వాలు కూడా భారీ స్థాయిలో నష్టపోయాయి. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటూనే మరోవైపు రాష్ట్రాలకు ఆదాయాన్ని సమకూర్చే ఆలోచనలో కేంద్రం పడింది. లాక్ డౌన్ కారణంగా పూర్తిగా స్తంభించిపోయిన అన్నిటిని పక్కా ప్రణాళికలతో తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలు పెడుతున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విద్యా సంస్థలు ప్రజా రవాణా సినిమాహాలు, రెస్టారెంట్లు కార్యకలాపాలు అన్నీ జాగ్రత్తతో ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

 

దీనికి సంబంధించి ప్రామాణిక నిర్వహణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించినట్లు సమాచారం. ఆ విధానంపై తగిన ప్రణాళికలు రూపొందించి తనకు నివేదిక ఇవ్వాలని అధికారులకు జగన్ సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ వల్లన రవాణా వ్యవస్థ స్తంభించి పోవటంతో వలస కుల్లిలు కాలి నడకను ఆధారం చేసుకున్నారు. అయితే ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకుని రైళ్లను తిప్పుతూ వారిని స్వస్థలాలకు చేర్పించడం మనకందరికీ తెలిసిందే.

 

ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ తిరిగి పునరుద్ధరించాలని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో కరోనా వైరస్ కట్టడి విషయంలో అధికారులకు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఎలాగైనా ఆర్థికంగా నష్టపోయిన ఖజానా తిరిగి పునరుద్ధరించడానికి ఏదోవిధంగా రాష్ట్రంలో పనులు తిరిగి ప్రారంభించాలని ప్రజలకు వైరస్ పై పూర్తి అవగాహన వచ్చే లాగా కూడా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు జగన్ సూచించినట్లు సమాచారం. ఏది ఏమైనా మే 17వ తారీకు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తి వేయడానికి జగన్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు వార్తలు బలంగా వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: