కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో తెలంగాణలో మొదట పరిస్థితి భయంకరంగా ఉన్న అదుపులోకి వచ్చినట్టు అనిపించింది. దీంతో ఆయన నిబంధనల్లో కొత్త సడలింపు ఇచ్చారు. అయితే ఇటీవల కొద్ది రోజులుగా రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ అవటంతో ప్రజలలో మరియు ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన ఎక్కువైంది. కరోనా వైరస్ డీల్ చేయడం లో కేసిఆర్ ముందు నుండి కేంద్ర ప్రభుత్వ వర్గాలతో వాళ్ళ నిర్ణయాలతో సంభంధం లేకుండా వ్యవహరించారు. కేంద్రం లాక్ డౌన్ మూడో దశ మే 17 వరకు పొడిగించగా కేసిఆర్ దాన్ని తెలంగాణాలో మే 29 వరకు పొడిగించారు. ఎక్కడికక్కడ పోలీసుల చేత లాక్ డౌన్ తెలంగాణ వ్యాప్తంగా పటిష్టంగా అమలు చేస్తున్నా వైరస్ వ్యాపిస్తున్న ఉండటం అందరికి ఆందోళన కలిగిస్తుంది.

 

ఈ నేపథ్యంలో మే 15వ తారీఖున సమీక్ష నిర్వహించిన తర్వాత మరోసారి కరోనా పాజిటివ్ కేసుల విషయంలోనూ, లాక్ డౌన్ నిబంధనల సడలింపులు విషయంలోనూ నిర్ణయం తీసుకోబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో నమోదవుతున్న కేసులు మొత్తం ముంబై నుంచి వచ్చిన వారి ఈ కారణంగానే నమోదు అవుతుండడం, ఇప్పటి వరకు గ్రీన్ జోన్ లో ఉన్న యాదాద్రి జిల్లాలో సైతం నాలుగు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మాత్రమే రెడ్ జోన్ లో ఉన్నాయి.

 

మిగిలిన అన్ని జిల్లాలు ఆరెంజ్, గ్రీన్ జోన్ లో ఉండేవి. ఆ సమయంలో కొన్ని జిల్లాలలో సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచించింది. అయితే వైరస్ ఉన్న కొద్దీ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతున్న తరుణంలో వెనక్కి తగ్గింది. అయితే ఇటువంటి సమయంలో చూసి చూసి ఇప్పుడు కేసీఆర్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించాలని టెస్టులు ఎక్కువ చేసే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: