లాక్ డౌన్ వల్ల ఆర్ధికపరంగా ఇబ్బందులు ఉన్నాసరే సీఎం జగన్, ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సున్నా వడ్డీ పథకం, జగనన్న విద్యా దీవెన ఇవ్వగా, ఇప్పుడు రైతు భరోసా అందించారు. రైతుల ఖాతాల్లో రూ. 5,500 డిపాజిట్ చేశారు. ఇంకా రెండు వేలుని సక్రాంతికి అందిస్తానని చెప్పారు. అటు కేంద్రం నుంచి రూ.6 వేలు విడతల వారీగా పడుతూనే ఉన్నాయి. మొత్తం మీద 'వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్ యోజ‌న' పథకం కింద రైతులకు రూ.13,500 అందిస్తున్నారు.

 

అయితే ఈ పథకం ద్వారా జగన్ రైతులని పూర్తిగా మోసం చేస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు వాదిస్తున్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే జగన్ మాట తప్పారని చెబుతున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ రూ.6 వేలు పథకం పెట్టకముందే, జగన్ ఎన్నికల హామీల్లో భాగంగా రూ.12,500 వేస్తానని చెప్పారని, అంటే దాని బట్టి చూసుకుంటే జగన్ అధికారంలోకి రాగానే రైతులకు 12,500 ఇవ్వాలని, కానీ ఆయన ఇచ్చేది రూ.7,500 మాత్రమే అని అంటున్నారు.

 

అంటే రూ.5 వేలు ఎగ్గొట్టి రైతులని మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఆయన మొదట్లో హామీ ఇచ్చిన ప్రకారం చూస్తే, రాష్ట్రం ఇచ్చే 12,500, కేంద్రం ఇచ్చే 6 వేలు అంటే, మొత్తం రైతులకు రూ.18,500 అందాలని, కానీ ఇప్పుడు రైతులకు అందుతుంది 13,500 మాత్రమే అని, కాబట్టి జగన్ రైతులని మోసం చేసినట్లే అని అంటున్నారు.

 

ఇదే సమయంలో గతంలో చంద్రబాబు రూ.9 వేలు ఇస్తా అన్నారని, అంటే కేంద్రం సాయంతో కలుపుకుంటే 15 వేలు అయ్యేదని, అలాగే కేంద్రం సాయం అందని రైతులకు రూ.10 వేలు ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ ఎన్నికల ముందు పథకం పెట్టడం వల్ల ప్రజలు నమ్మలేదని తమ్ముళ్ళు బాధపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: