అనుభవం లేని బాడీ అధికారంలోకి వచ్చిన జగన్ ఏపీ రాష్ట్రంలో అందిస్తున్న పరిపాలన దేశవ్యాప్తంగా సంచలనం గా మారుతుంది. జగన్ అధికారంలోకి వచ్చే ఏడాది కావాల్సిన క్రమంలో అతి తక్కువ సమయంలోనే తాను ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో పేరు సంపాదించాడు. అలాగే కొన్ని ప్రాముఖ్యమైన సంస్థల సర్వేలలో దేశంలో ప్రజలకు బాగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ మూడో స్థానం దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా పరిపాలనలో జగన్ దార్శనికత జాతీయస్థాయిలో చాలామంది నాయకులకు నచ్చుతుందట. ప్రధాని మోడీ కి కూడా జగన్ లో ఇదే నచ్చింది అని జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో జనాలకి ఇచ్చిన మాటను తప్పకుండా ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేసే తీరును అందరిని ఆకర్షిస్తున్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వినపడుతున్నాయి.

 

అదే విధంగా ఎటువంటి భయం లేకుండా రాజకీయాలు చేయటం మరియు ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చెప్పడం పరిస్థితి వివరించడం జగన్ లో స్పెషాలిటీ. ఇదే సమయంలో దేశంలో కరోనా వైరస్ చూసి చాలామంది నాయకులు భయపడిపోయారు. దాన్ని డీల్ చేయటం విషయంలో తల మునకలు అయ్యారు. కానీ వైయస్ జగన్ మాత్రం కరోనా వైరస్ ను ఎదుర్కొనే విషయంలో అందరికంటే చాలా మంది ఉన్నారు. చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటు మరోపక్క విషయం అర్థం చేసుకుని ఇకనుండి రానున్న రోజుల్లో కరోనా వైరస్ తో బతకాల్సిందే అని మొహమాటం లేకుండా చెప్పారు.

 

వాస్తవానికి చూసుకుంటే దేశంలో అనేక మంది అనుభవంగల ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఈ విధంగా నిర్భయంగా జగన్ లాగా చెప్పినవారు లేరు. కరోనా వైరస్ గురించి ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ మోడీ కి అందరికంటే ముందే కలిసి జీవించాలని ఈ వైరస్ తో తెలిపారు. అలాగే ఒక పక్క మనుషులలో అవగాహన కల్పించి మరో పక్క ఆర్థిక అడుగులు వేస్తూ నే దేశం ముందుకు వెళుతుందని మోడీ కి జగన్ చెప్పిన మాటలు చాలా బాగా నచ్చాయి. ముందుగా జగన్ కరోనా తో రాబోయే రోజుల్లో బతకాలి అని అన్న సమయములో నవ్విన వాళ్ళు మోడీ కూడా అదే వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రం నోరు మెదప లేక పోతున్నారు. ఇదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే తెలపడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: