ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం, తెలుగు మీడియం విద్యా విధానం పై కొత్త కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జగన్ సర్కార్ ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం తీసుకురావాలని ప్రయత్నించగా విపక్షాలు తీవ్రంగా అడ్డుపడిన విషయం మనకందరికీ తెలిసిందే. తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి చేస్తూనే మరో పక్క ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం ప్రవేశపెడతామని చెప్పిన విపక్షాలు లెక్కచేయలేదు. చివరికి న్యాయస్థానానికి వెళ్లి ఏకంగా ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు కాకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి.

 

ప్రభుత్వ స్కూల్లో ని పేరెంట్స్ కమిటీల ఆధారంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం సరికాదు అంటూ హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా జగన్ సర్కారు జారీ చేసిన జీవోలు మొత్తం కొట్టేసింది. అయితే ఈ విషయంలో వెనకడుగు వేయని జగన్ ప్రభత్వం పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అభిప్రాయాలను సేకరించింది. దాదాపు 86.7% తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉండాలని జై కొట్టారు.

 

ఈ అభిప్రాయ సేకరణ నివేదిక ఆధారంగా ఇప్పుడు జగన్ సర్కార్ ముందుకు వెళ్లడానికి రెడీ అయ్యింది. అయితే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్ వేసిన వారి వెనకాల ఉన్నవారు కూడా పాఠశాలలు నడిపించే వారు ఉన్నారు. వారి స్కూల్ లో మాత్రం తెలుగు మీడియం లేదు. ఇటువంటి సమయంలో కార్పోరేట్ మరియు ప్రైవేట్ స్కూల్లో కూడా తెలుగు మీడియం కంపల్సరీ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో ప్రజా వ్యాజ్యం పేరిట కోర్టులో పిటిషన్ దాఖలు అయినట్లు సమాచారం. మరి ఈ విషయంలో న్యాయస్థానం కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: