2014 ఎన్నికల టైంలో చంద్రబాబు కాపులను బీసీల్లో చేరుస్త అని హామీ ఇచ్చి గాలికి వదిలేసిన టైంలో కాపు ఉద్యమం చేశారు ముద్రగడ పద్మనాభం. ముద్రగడ చేసిన ఈ ప్రయత్నానికి రాష్ట్రవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోయింది. కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీపై చంద్రబాబుపై తీవ్రస్థాయిలో అప్పట్లో ఉద్యమించారు. చంద్రబాబు ఇది తీవ్ర రూపం దాల్చక ముందు ముద్రగడ పద్మనాభం ని ఇంటికి పరిమితం చేసే విధంగా హౌస్ అరెస్టు చేశారు. అంతేకాకుండా ఆ టైంలో ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను సైతం ఇల్లు వదిలి బయటకు రాకుండా అన్ని చర్యలు చేపట్టారు. ఇటువంటి సమయంలో కాపుల విషయంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు పది శాతం రిజర్వేషన్ తో ఎంతో కొంత ఊరట ఇచ్చే విధంగా చంద్రబాబు ప్రకటించడం జరిగింది.

 

అయితే ఈ విషయంలో ముద్రగడ పద్మనాభం పలు ప్రశ్నలు టిడిపి కి సంబంధించిన పెద్దగా లాభం లేకుండా పోయింది. ఇక కట్ చేస్తే జగన్ అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఈ సమయంలో గతంలో చంద్రబాబు కాపులకు ఎన్నికల ముందు హడావిడిగా ఇచ్చిన ఉత్తర్వులను జగన్ సర్కార్ తాజాగా కొట్టిపారేసింది. కాపు రిజర్వేషన్ అంశం లో ముందు నుండి వైయస్ జగన్ ఇది తమ పరిధిలో ఉన్న అంశం కాదని కేంద్ర పరిధిలో ఉన్న అంశమని ఈ విషయంలో తాము ఏమి చేసేది లేదని తేల్చేసింది.

 

ఎన్నికల టైంలో కూడా జగన్ ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే తాజాగా చంద్రబాబు కాపులకు కేటాయించిన ఉత్తర్వులను జగన్ కొట్టేయడంతో కాపు వర్గాలకు చెందిన వాళ్లు మరోసారి ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి రెడీ అవుతారు అని అందరూ భావించారు. కానీ ముద్రగడ పద్మనాభం నుండి ఎటువంటి ఉలుకు పలుకు లేదు. అసలు ఆయన ఎక్కడున్నారు అని ఇప్పుడు కాపు నేతలు అంటున్నారు. జగన్ తో లోపాయికారి ఒప్పందం ఏమైన కుదుర్చుకున్నాడా అని ప్రశ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: