భారతదేశంలో మొట్టమొదటి సారి కరోనా వైరస్ కేసు బయటపడిన రాష్ట్రం కేరళ. దీంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. దేశంలో అన్ని విమానాశ్రయాలలో స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభించింది. అయినా కానీ ఉన్న కొద్ది కేసులు నమోదు కావడంతో వెంటనే మోడీ సర్కార్ లాక్ డౌన్ ప్రకటించింది. ముందు నుండి చూసుకుంటే కేరళలో భయంకరంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అయినా కానీ కరోనా వైరస్ తో పోరాడి తీవ్రమైన కట్టడి చర్యలతో పాటు వైరస్ వ్యాప్తి చెందకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుని దేశంలోనే ఎక్కువ రికవరీ కరోనా వైరస్ కేసుల్లో నమోదవుతున్న రాష్ట్రంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

 

దీంతో మొదటిలో ఆశించిన స్థాయిలో కంటే కేసులో మొత్తం దాదాపు తగ్గిపోవడంతో ఊపిరిపీల్చుకున్నట్లు అయింది. చాలా వరకు కరోనా వైరస్ వ్యాధిని జయించిన రాష్ట్రంగా కేరళ అందరి మన్ననలను అందుకుంది. ఇదిలా ఉండగా మొన్నటి వరకు ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు అవకుండా ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇటీవల 36 కేసులు నమోదు కావడంతో కేరళలో సరికొత్త పిడుగు పడినట్లు అయింది. లాక్ డౌన్ సడలింపు ల విషయంలో కేంద్రం తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

 

అయితే కేసులో ఇప్పుడు ఎవరి వల్ల నమోదవుతున్నాయి అన్న దానిపై దృష్టి పెట్టినప్పుడు, కేసుల నమోదు మొత్తం విదేశాలనుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కారణంగానే తాజా కేసులు నమోదవుతున్నట్లుగా గుర్తించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి విజయన్ వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసుల్లో సగం మంది విదేశాల నుంచి.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితోనే అన్న విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో ఏ రీతిన అయితే లాక్ డౌన్ అమలు చేశారో అదే రీతిలో మళ్ళీ లాక్ డౌన్ అమలు చేయాలని అనుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: