ప్రస్తుతం ఉగ్రవాదులు కూడా చాలా సంస్థలుగా  ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎంత మంది గ్రూపులు  ఉన్నప్పటికీ భారతదేశంపై దాడి చేసి వినాశనం సృష్టించడమే వారి లక్ష్యం. అయితే ప్రస్తుతం ఈ గ్రూపులు అన్నిటినీ ఒకే వేదిక పైకి తీసుకు వచ్చేందుకు ఐఎస్ఐ ప్రయత్నాలు చేస్తోందని తాజాగా తేలింది. పాకిస్తాన్ కాశ్మీర్ లో ది రెసిస్టెన్స్ ఫ్రాంట్  అనేటువంటి పేరుతో ఈ గ్రూపులో అన్నింటినీ ఒకటిగా చేసి.. ఇప్పటి వరకు ఉన్న ఉగ్రవాద సంస్థల అన్నింటినీ కలిపి... రెసిస్టెంట్ ఫ్రాంట్  అనేటువంటి ఏర్పాటు చేస్తుంది. 

 


 శీతాకాలం నెలలో సాధారణంగా కాశ్మీర్లో చాలా చల్లగా ఉంటుంది కాబట్టి.. ఆ సందర్భంలో స్థానికంగా ఉన్న ప్రజలను రెచ్చగొట్టడానికి అంతే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి తీసుకు వచ్చిన వారందరినీ ప్రభుత్వం చేసే ప్రతి పనికి విరుద్ధంగా ఉద్యమాలు చేసేలా చేసేలా అల్లర్లు చేసేలా చేసి..  కాశ్మీరీలే  ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు అనుకునేలా  చేయడం...దీనిని  ఉగ్రవాదులు తెరవెనుక ఉండి నడిపిస్తున్నారు అని అంటున్నారు విశ్లేషకులు. అంటే కాశ్మీరీ  ప్రజల లాగా అక్కడే ఉండి పోయి వారు కూడా అక్కడి  ప్రజలే  అనుకునే లాగా ఓవైపు అందరినీ నమ్మిస్తూ మరోవైపు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అల్లర్లు  చేయడమే ప్రస్తుతం ఐఎస్ఐ ముఖ్య లక్ష్యం అన్నట్లుగా భావిస్తున్నారు విశ్లేషకులు. 

 

 దీంతో సైన్యం దీనిని ముందుగానే పసిగట్టి దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మామూలుగా అయితే సైన్యం లా అండ్ ఆర్డర్ విషయాలలో  ఎలాంటి జోక్యం చేసుకోదు. అయితే కాశ్మీర్ లో అల్లర్లు సృష్టించేది  స్థానిక ప్రజలు కాదని వేర్పాటువాదులు స్థానిక ప్రజల పేరుతో రెసిస్ట్  చేస్తూ ఉంటారని అంటున్నారు విశ్లేషకులు. అయితే తాజాగా పాకిస్తాన్ వ్యూహం బయటపడగా దీనిపై  భారత ఆర్మీ వ్యూహం ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: