తెలంగాణలో కరోనా వ్యాప్తి , నివారణ చర్యలు లాక్ డౌన్ అమలు పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొన్ని రోజుల నుండి భారీగా కేసులు నమోదవుతున్ననేపథ్యంలో ఎవరు భయపడాల్సిన పనిలేదని పరిస్థితి కంట్రోల్ లోనే ఉందని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లో కేవలం నాలుగు జోన్లలో మాత్రమే కరోనా ప్రభావం ఉందని అందులో చార్మినార్ , మలక్ పేట్ , కార్వాన్ , ఎల్బీ నగర్ లో తప్ప రాష్ట్రంలో మరెక్కడా యాక్టీవ్ కేసులు లేవని అన్నారు అలాగే రేపటి నుంచి ఏసీలు అమ్మే షాపులు, ఆటోమోబైల్ షో రూమ్‌లు, ఆటో మోబైల్ స్పేర్ పార్ట్స్ షాపులు తెరిచేందుకు అనుమతిస్తున్నాం.. కానీ  మిగతా లాక్ డౌన్ నిబంధనలు యథావిధిగా అమలవుతాయని అన్నారు అలాగే ఈ నెల 17తో దేశ వ్యాప్త లాక్ డౌన్ ముగుస్తున్న దృష్ట్యా కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను పరిశీలించి, రాష్ట్రంలో అనుసరించే వ్యూహం ఖరారు చేస్తామని తెలిపారు.
 
ఇక తెలంగాణలో ఈరోజు కొత్తగా 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈకేసులతోకలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు1,454 చేరిన కరోనా కేసులు నమోదు కాగా అందులో ప్రస్తుతం 461 కేసులు యాక్టివ్ గా ఉండగా ఇప్పటి వరకు కరోనా వల్ల మొత్తం 34 మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: