దేశంలో కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 3750 కరోనా కేసులు నమోదయ్యాయి అందులో ఎక్కువగా మహారాష్ట్రలో 1576,తమిళనాడు లో 434, ఢిల్లీ లో 425 , గుజరాత్ లో  340, రాజస్థాన్ లో 213, మధ్య ప్రదేశ్ లో 169 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు  దేశ వ్యాప్తంగా  మొత్తం 85750 కేసులు నమోదు కాగా అందులో 30000 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 2661 మంది కరోనా వల్ల మరణించారు. ఓవరాల్ గా అత్యధిక కరోనా కేసులు నమోదయిన  దేశాల జాబితాలో ఇండియా, చైనా ను దాటేసి 11వ స్థానంలో నిలించింది. చైనా లో మొత్తం 82933 కేసులు నమోదు కాగా 4633మరణాలు చోటుచేసుకున్నాయి.  
 
ఇక రేపటి తో మూడో దశ లాక్ డౌన్ ముగియనుంది అయితే కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో కేంద్రం  మరో సారి లాక్ డౌన్ పొడిగించనుంది.  అందులో భాగంగా మే18 నుండి 30వరకు లాక్ డౌన్ ను పొడిగించే యోచనలో వున్నట్లు సమాచారం. అయితే లాక్ డౌన్ పొడిగించిన కూడా మరిన్ని మినహాయింపులు ఇవ్వడానికి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఆదివారం లాక్ డౌన్  పై కీలక ప్రకటన వెలుబడే అవకాశాలు వున్నాయి. 
 
ఇక మిగితా దేశాల విషయానికి వస్తే అమెరికా లో కరోనా ప్రభావం కొనసాగుతూనే వుంది. ముఖ్యంగా న్యూయార్క్ లో కరోనా విలయతాండవం చేస్తుంది దీని దెబ్బకు జూన్ 13 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు న్యూయార్క్ గవర్నర్ ప్రకటించాడు. ఇప్పటివరకు న్యూయార్క్ లో  343000 కరోనా కేసులు నమోదు కాగా అందులో 22170 మంది  కరోనా వల్ల మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: