దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 80,000 దాటింది. కేంద్రం లాక్ డౌన్ ను ప్రకటించినా దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రేపటితో మూడో విడత లాక్ డౌన్ ముగియనుండగా మే 18 నుంచి నాలుగో విడత లాక్ డౌన్ అమలులోకి రానుంది. కేంద్రం నాలుగో విడత లాక్ డౌన్ లో భారీగా సడలింపులు ఇవ్వనుందని వార్తలు వచ్చాయి. 
 
కేంద్రం నాలుగో విడత లాక్ డౌన్ లో దశల వారీగా రైల్వే, దేశీయ విమానాల ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని తెలుస్తోంది. కేంద్రం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత కేంద్రాలకు కరోనా హాట్ స్పాట్లను గుర్తించే అధికారం ఇవ్వనుందని సమాచారం. రైల్వే, దేశీయ విమానాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే దిశగా అడుగులు వేయడం ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారికి శుభవార్త అనే చెప్పాలి. 
 
కేంద్రం సడలింపుల వల్ల చాలా మంది సొంత రాష్ట్రాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. పాఠశాలలు, కాలేజీలు, మాల్స్, సినిమా థియేటర్లకు ఎలాంటి సడలింపులు ఉండవని తెలుస్తోంది. కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు యథావిధిగా అమలు కానున్నాయి. కేంద్రం రెడ్ జోన్లలో సెలూన్లకు, కళ్లజోళ్ల దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సమాచారం. కేంద్రం గ్రీన్ జోన్లలో పూర్తిగా ఆంక్షలు సడలించనుందని తెలుస్తోంది. 
 
ఆరెంజ్ జోన్లలో పరిమిత ఆంక్షలు ఉంటాయని తెలుస్తోంది. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను కొనసాగించాలని కోరుతున్నా అదే సమయంలో సడలింపులు ఇవ్వాలని కోరుతున్నాయని తెలుస్తోంది. కేంద్రం ఈ కామర్స్ సంస్థలు డెలివరీ చేసేందుకు పూర్తిగా అనుమతులు ఇవ్వనుందని సమాచారం. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా అన్ని జోన్లలో కేంద్రం భారీ సడలింపులు ఇవ్వనుందని తెలుస్తోంది.             

మరింత సమాచారం తెలుసుకోండి: