మానవ సంబంధాలు మనితో ముడిపడి ఉన్నాయనడానికి ఈ ఘటనే ఉదాహరణ.. పుట్టినప్పటి నుండి మెట్టినింట అడుగుపెట్టే వరకు అక్కచెళ్ల మధ్య ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. అక్కకు కష్టం వస్తే చెల్లి, చెల్లికి ఇబ్బంది కలుగుతే అక్క.. ఒకరికొకరు అన్నట్లుగా జీవిస్తారు.. కానీ పెళ్ళి చేసుకుని వారికి వేరే కుటూంబం ఏర్పడ్డాక ఎవరి సంసారం వారిది.. దీనికి తోడుగా స్వార్ధం కూడా వారిలో ప్రవేశిస్తుంది.. ఇలా అని కట్టుకున్న భర్తను, కన్న పిల్లలను ద్వేషించమని చెప్పడం లేదు, కాని కనిపెంచిన తల్లిదండ్రుల పట్ల, తోడబుట్టిన వారిపట్ల, ప్రేమతో ఉండటమే మంచితనానికి మనం ఇచ్చే విలువ..

 

 

కానీ లోకంలో డబ్బుకోసం ఏదైనా చేయడానికి వెనుకాడటం లేదు, చివరికి కన్న వారిని, తోడబుట్టిన వారిని కూడా వంచిస్తున్నారు.. ఇప్పుడు మనం చదవబోయే ఘటన ఇలాంటిదే.. ఒక మహిళ తన తల్లిదండ్రులను, తోడపుట్టిన చెల్లెలిని మోసం చేసి ఆమె మరణానికి కారణమైంది.. ఆ వివరాలు చూస్తే.. కృష్ణాజిల్లా గుడివాడ.. బేతవోలు నిమ్మతోటలో నివాసముంటున్న వీరంకి గంగారావు, చుక్కమ్మలకు ఇద్దరు కుమార్తెలు.. కాగా పెద్ద కూతురికి వివాహం చేసి చాలా కాలం అయ్యింది.. అయితే చిన్నకూతురు అయిన మౌనిక గత నెలలో కొడాలికి చెందిన డేనియల్‌ను వివాహం చేసుకుంది.. ఈ నేపధ్యంలో నిరక్షరాస్యులు అయిన తల్లిదండ్రులను పెద్ద కూతురు తన భర్తతో కలిసి ఇల్లుకట్టుకుంటున్నాం బ్యాంకు ష్యూరిటీ కోసమని మౌనిక తల్లి చుక్కమ్మ పేరుతో ఉన్న ఎకరంన్నర పొలం డాక్యుమెంట్లు కావాలని మోసం చేసి తీసుకున్నారు.

 

 

ఈ క్రమంలో అర్ధ ఎకరం నూతవధువు పేరిట ఉన్నది.. తనకు రావలసిన అర్ధ ఎకరం పొలం తనకు కావాలని అడగ్గా. అక్కబావ మౌనికపట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఆ పొలం మొత్తం తమపేరున రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నామని, ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో మౌనిక మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో పొలం కోసం తెచ్చిన గుళికలు తీసుకున్నది.. కాగా, కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆరోగ్య కేంద్రానికి తరలించగా, చికిత్స పొందుతున్న ఆమె నిన్న రాత్రి మృతి చెందింది. తల్లి చుక్కమ్మ ఫిర్యాదు మేరకు పెద్ద కుమార్తె బొల్లా నాగలక్ష్మి, అల్లుడు శ్రీనివాసరావు, మనమలు సాయి, మరో బాలుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దుర్గాప్రసాద్‌ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: