లోకంలో మనుషులు మృగాలుగా మారుతున్న వేళ.. నిజమైన మృగాలు తమ స్వభావాన్ని విడిచి సాధుజంతువుల్లా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాయి.. ఒక రకంగా నేటికాలంలో మనిషి తోడేళ్లకంటే ఘోరంగా, మొసళ్ల కంటే దారుణంగా, సాటి మనిషి అని కూడా చూడకుండా స్వార్ధంతో, మోస పూరితంగా, ఎంత వరకు దోచుకోవాలో అంత వరకు, ఎందాక వాడుకోవాలో అందాక ఉపయోగించుకుని, చివరికి కళ్ల ముందు ప్రాణాలు కోల్పోతున్నా కనికరం లేకుండా రాక్షస ఆనందాన్ని పొందుతున్నాడు.. కానీ ప్రకృతిలో బద్ద శత్రువులైన ఆవు, చిరుతల మధ్య స్నేహం చిగురించింది..

 

 

అసలే కౄరమృగం దీనికి వేటాడి చంపడం తప్పితే స్నేహం చేయడం తెలియదు.. కానీ ఎలా మారిందో కాని తన స్నేహితున్ని చూడటానికి ప్రతి రోజూ రాత్రి పొద్దు పోయాక సమీపంలోని అడవి నుంచి పశువుల దొడ్డికి వచ్చి తెల్లారే వరకు ఆవు దగ్గర నిద్రించి వెళ్తుందట.. ఇకపోతే ఆ ఆవు యజమాని మొదట్లో కాస్త భయపడిన, వాటి మధ్య ఉన్న చనువు చూసి అతనికే ఆశ్చర్యం వేసిందట.. నిజానికి వీటి మధ్య స్నేహం ఎలా మొదలైందో కానీ ఇది మాత్రం ప్రకృతిలో జరుగుతున్న వింతైన స్నేహం.. అయితే వీటి మధ్య స్నేహం చిగురించిన విషయంలో విభిన్నమైన కధనాలు వినిపిస్తున్నాయి..

 

 

అదేమంటే. తల్లి వదిలేసిన చిరుత కూనకు ఆవు పాలిచ్చి పెంచిందని, కాగా కొన్నాళ్ల తర్వాత ఎటో వెళ్లిపోయిన చిరుత కూన మూడేళ్ల వయసులో తన పెంపుడు తల్లిని వెతుక్కుంటూ వచ్చిందనేది ఒక కథనం. ఏది ఎలా ఉన్న, ఒక కౄర జంతువు, మరొక సాధుజంతువు మధ్య స్నేహం అనేది ఊహకందని విషయం.. అన్ని తెలిసిన మనిషి ఒక మనిషితో స్వార్ధం లేకుండా బ్రతకలేక పోతున్న కాలంలో వీటి స్నేహం చూసిన మనిషి అనే వారు సిగ్గుపడవలసిన విషయంగా చెబుతున్నారు.. ఇకపోతే ఈ ఘటన ఎక్కడ జరిగిందని ఆలోచిస్తున్నారా.. మన దేశంలోనే.. తమిళ నాడు దగ్గర్లో కోయంబత్తూరు నుంచి 27 కిలోమీటర్ల దూరంలోని నరసిపురం అనే గ్రామంలో ఈ వింత జరిగిందట.

 

కాగా వీరి స్నేహాన్ని మనోజ్ థాకర్ అనే ఫోటోగ్రాఫర్ 2016 లో ప్రపంచానికి తెలియచేసాడని చెబుతున్నారు.. ఇక చిరుతను చూసి ఆవు భయపడక పోవడాన్ని బట్టి ఈ రెండిటి మధ్య అనుబంధం కనీసం ఏడాదిగా ఉండి ఉంటుందని ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు.. ఇది ఎప్పుడు జరిగిందనే విషయం పక్కన పెడితే ఇలా జరగడం చాలా అరుదు.. మనుషులు కూడా తమలోని కౄరత్వాన్ని మరిచి ఇలా జీవిస్తే ఈ ప్రపంచంలో ఇంతగా విధ్వంసాలు జరిగేవి కావు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: