దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు వలస బాట ప‌ట్టారు. ఒక‌వైపు ఆకలితో పోరాడుతూ, మ‌రోవైపు ఎండ‌వేడిమి‌ని త‌ట్టుకుంటూ, చుర్రుమ‌నే రోడ్ల‌పై వేల మైళ్ల ప్ర‌యాణాలు సాగిస్తున్నారు.  తట్టాబుట్టా సర్దుకొని మండుటెండల్లో ప్రయాణం సాగిస్తున్నారు. కొందరైతే అతి ప్రమాదకరంగా రైల్వే పట్టాలపై నడుస్తున్నారు. మరికొందరు ట్రక్కుల్లో తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రప్రాంతపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా లేఖ రాశారు. ఇప్పటికీ వలస కార్మికులు నడిచి వెళ్తున్న ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని.. రైల్వే పట్టాలపైనా నడుచుకుంటూ వెళ్తున్నారని లేఖలో పేర్కొన్నారు. చిన్న చిన్న పిల్లలు నడిచీ నడిచీ కాళ్లు కందిపోతున్నాయి.. నొప్పితో తట్టుకోలేక పోతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.  చండీగఢ్‌లోని మలోయాకు చెందిన 10 ఏళ్ల బాలిక‌ కూడా తన తల్లిదండ్రులతో కలిసి న‌డుస్తూ ముందుకు సాగుతోంది. ఇంటి నుంచి బ‌య‌లుదేరే ట‌ప్ప‌డు ఆమెకు చెప్పులు ఉన్నాయి. దారిలో అవి పాడ‌యిపోవ‌డంతో ఆ చెప్పుల‌ను పారేసి, ఉత్త కాళ్ల‌తో న‌డ‌క ప్రారంభించింది.

 

మహిళల సమస్యలు వర్ణనాతీతంలేబర్‌ అడ్డాలపై మహిళలకు టాయిలెట్స్‌, వేచి ఉండటానికి షెడ్డులు, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలి. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి సరిపోయే నిధులు కేటాయించి సక్రమంగా ఖర్చు పెట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.కడుపు మాడ్చుకోవాల్సిందే ...ఎన్నో గ్రామల నుండి కూలీ పనుల కోసం ఇతర నగరాలకు వలస పోయ్యారు. తెల్లవారు జామున అడ్డాలపై నిలబడి పని కోసం వెదురు చూడాలి.

 

రోజు రోజుకు అడ్డాలపై పని కోసం ఎదురు చూసే వారి సంఖ్య పెరిగిపోతుంది. దాంతో అందరికీ పని దొరకడం లేదు. పని దొరికిన రోజు కుటుంబం కడుపు నిండా తింటుంది. మిగిలిన రోజుల్లో కడుపు మాడ్చుకోవాల్సిందే. ఇలాంటి కార్మికుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ కార్మికులకు చేతినిండా పని కల్పిస్తే హాయిగా బతకగలుగుతారు.  ఎక్కడ తినే అవకాశం ఉంటే అక్కడే తినాలి. చీకటి పడేవరకు శ్రమించాలి. దాంతో సంపాదన ఉన్నా, లేకున్నా కొంత పోలీసులకు ముట్ట జెప్పక తప్పదు. రోడ్డుపై ట్రాఫిక్‌ అవుతుందని పోలీసులతోపాటు పెద్ద పెద్ద వ్యాపారుల వేదింపులు తప్పవు. ఇలాంటి వేధింపుల నుండి తమకు రక్షణ కల్పించమని కార్మిక శాఖా అధికారుల ముందు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: