కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా చేపడుతోంది. ఆ పథకం పేరు " మహిళా ఉద్యమ్ నిధి " స్కీమ్. ఈ పథకాన్ని స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) అందిస్తోంది. ఇకపోతే ఇది కేవలం ఉమెన్ ఎంటర్ ప్రెన్యూవర్ లకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీనివలన వ్యాపారం చేయాలని భావించే మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించవచ్చు. ఇక ఈ స్కీమ్ దృష్ట్యా బ్యాంకులు అర్హులైన మహిళలకు ఆకర్షణీయ వడ్డీ రేటుకే రుణాలు మనకు అందిస్తున్నాయి. దీనితో మహిళలు ఉమెన్ ఎంటర్‌ప్రైజ్ ఫండ్ ద్వారా ఈ లోన్స్ వారు అందుకోవచ్చు.

 

ఇక మహిళలు ఈ స్కీమ్ కింద రూ.10 లక్షల వరకు రుణాన్ని పొంది వారి సొంత వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. ఇకపోతే ఈ స్కీమ్ లో భాగంగా బ్యాంకులు వాటికి నచ్చిన వడ్డీ రేటును నిర్ణయించబడుతాయి. ఇక కొత్తగా వ్యాపారం చేయాలని భావించే వారు మాత్రమే కాకుండా ఇప్పటికే బిజినెస్ చేస్తున్న మహిళలు దాని కార్యకలాపాల విస్తరణకు కూడా రుణం పొందవచ్చు. అంతేకాదు ఈ స్కీమ్ లో పండిన రుణాన్ని 10 సంవత్సరాల లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ లోనే తీసుకోవాలంటే వారు చేసే వ్యాపారంలో కచ్చితంగా 51 % వాటా ఉండాలి. MSMI, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు చెందిన బిజినెస్ లు చేయాల్సి ఉంటుంది ఇందులో. ఇకపోతే అందులో రూ.5 లక్షలకు తగ్గకుండా ఇన్వెస్ట్మెంట్ కచ్చితంగా చేయాలి. అంతేకాదు రూ.10 లక్షలకు  దాటకూడదు కూడా. అయితే ఇందుకు వడ్డీ రేట్లు సిడ్బి, బ్యాంకుల ఇష్టం. తగ్గించుకోవచ్చు లేదంటే పెంచవచ్చు. ఈ రుణం కింద బ్యాంకులు సర్వీస్ చార్జీల కింద 1 % వసూలు చేస్తాయి.

 

క్యాంటీన్, రెస్టారెంటు, కంప్యూటరైజర్డ్ డెస్క్‌టాప్ పబ్లిషింగ్, సైబర్ కేఫ్, ఫోన్‌బూత్, ల్యాండ్రీ, మొబైల్ రిపేరింగ్, ఆటో రిపేరింగ్ అండ్ సర్వీస్ సెంటర్, సెలూన్, టైలరింగ్, టైపింగ్ మెషీన్, అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్, బ్యూటీ పార్లర్, కేబుల్ టీవీ నెట్‌వర్క్, ఫోటోకాపీ సెంటర్, టీవీ రిపేరింగ్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు వంటి పలు బిజినెస్ ‌లను వారు ప్రారంభించొచ్చు. ఇక మొదట్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక్కటే ఈ తరహా రుణాలను అందించేంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు చాలా బ్యాంకులు ఈ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇకపోతే మహిళల కోసం కేవలం ఈ ఒక్క స్కీమ్ మాత్రమే కాకుండా " ముద్రా లోన్స్, దేనా శక్తి యోజన, అన్నపూర్ణ యోజన, శ్రీ శక్తి స్కీమ్, సెంట్రల్ వెల్ఫేర్ స్కీమ్, ఉద్యోగ్ శక్తి యోజన " వంటి పలు రకాల స్కీములు అందుబాటులో ఉన్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: