కరోనా ప్రభావం దేశంలో ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది..అయితే లాక్ డౌన్ పేరుతో ప్రజలను ఇళ్లకే పరిమితమయ్యే లా ప్రభుత్వం చేసింది.  దీని వల్ల ఎన్నో వ్యాపారాలు నష్టాలను చవిచూసింది.. అంతేకాక  అన్నీ రకాల వాణిజ్య వ్యాపారాలు మూతపడ్డాయి.  దీంతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది.. ఇది ఇలా ఉండగా మందుబాబులు పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది.. రోజు రోజుకు కరోనా పెరుగుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.. 

 

 


చుక్క లేనిదే కునుకు తీయని మందు బాబులు పరిస్థితి  అయోమయంలో పడింది.. లాక్‌డౌన్‌తో మద్యం షాపులు మూసేయడంతో మద్యానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఏపీలో కొద్దిరోజులు షాపులు తెరిచినప్పటికీ స్టాక్ లేకపోవడం.. కొన్ని దుకాణా లు మూసేయడం తో డిమాండ్‌ కి తగినట్టు గా సరఫరా జరగడం లేదు. మద్యం రేట్లు కూడా 75 శాతం పెంచడం తో కొందరు అక్రమ మద్యం వ్యాపారా నికి తెర లేపారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తెచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తు న్నారు. మద్యాన్ని బోర్డర్లు దాటించే క్రమంలో అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా అంత ర్రాష్ట్ర సరి హద్దు వద్ద చేపట్టిన తనిఖీ ల్లో భారీ గా మద్యం సీసాలు బయట పడ్డాయి.

 

 

 


తెలంగాణ నుంచి ఏపీకి పుచ్చ కాయల లోడు తో వస్తున్న లారీని గుంటూరు జిల్లా పొందుగుల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీల్లో అక్రమం గా తరలిస్తున్న మద్యం సీసాలు పట్టు బడ్డాయి. పైన పుచ్చ కాయలు.. వాటి కింద మద్యం సీసాలు పెట్టి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సుమారు మూడు లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. మద్యం బాటిళ్లు ను తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: