ఇప్పుడు దేశం మొత్తం కరోనా కాటేస్తుంది. ముఖ్యంగా మార్చి నెల నుంచి లాక్ డౌన్ విధించిన కారణంగా వలస కూలీలు ఎక్కడిక్కడే బందీలైయ్యారు.  కొంత మంది తమ స్వస్థలాలకు చేరుకోవడాని వందల కిలోమీటర్లు కాలి నడకన.. ఏదైనా వాహనాలు దొరికితే దొంగ చాటుగా ప్రయాణించారు.  ఈ మద్య వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించింది కేంద్రం.  ఈ నేపథ్యంలో రైళ్లు, బస్సులు సౌకర్యాులు కూడా ఏర్పాటు చేశారు. తాజాగా కొంత మంది వలస కూలీలు తిరిగి తమ సొంత గ్రామాలకు వెళుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నడిచి వెళ్లలేక, ప్రభుత్వం సాయం అందక అవస్థలు పడుతున్న ఓ కార్మికుడు తాను ఇన్ని రోజులు ఉన్న వీధిలోని ఒకరి సైకిల్‌ను చోరీ చేశాడు.

దానిపై తన గ్రామానికి బయలుదేరాడు. ట్విస్ట్ ఏంటేంటే ఈ దొంగ ఎవరికీ చెప్పా పెట్టకుండా చోరీ చేశారంటే అపార్థం చేసుకోవొచ్చు. సదరు కార్మికుడు తన నిజాయతీని ప్రదర్శించాడు. చోరీ చేసే సమయంలో ఓ చీటీ రాసి, సైకిల్ యజమానికి సారీ చెప్పాడు. రాజస్థాన్‌లోని భ‌రత్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తాను ఇంటికి వెళ్లేందుకు మ‌రో మార్గం లేదని, తనకు ఓ కుమారుడు ఉన్నాడని, తాను అతడి కోసమే ఇలా చేయాల్సి వ‌చ్చిందని ఆ చీటీలో పేర్కొన్నాడు. తన కుమారుడు వికలాంగుడని, నడవలేడని తెలిపాడు. తాము బరేలీ వెళ్లాల్సి ఉందని అందులో రాసుకొచ్చాడు.

 

అయితే, అతడు చేసిన చోరీపై ఆ సైకిల్ యజమాని సహబ్ సింగ్ సానుకూలంగా స్పందించాడు. అయితే ఆ సైకిల్ యజమాని కూడా సానుకూలంగా స్పందించాడు.. నిజంగా ఇప్పుడు దేశం ఎంతో కష్టకాలంలో ఉంది.. నా సైకిల్ అతనికి ఇలా ఉపయోగ పడింది.. పరవాలేదు. సైకిల్ మళ్లీ కొనొచ్చు...కానీ ఆయన కుటుంబ కష్టం వింటే చాలా బాధగాఉందని అన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: