కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వ్యవహారం మరోసారి చర్చకు తెర తీసింది. గత టిడిపి ప్రభుత్వంలో కాపు రిజర్వేషన్ల అంశంపై పెద్ద ఎత్తున పోరాటం చేసిన ముద్రగడ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కొద్ది రోజుల క్రితం రిజర్వేషన్ అంశానికి సంబంధించి సీఎం జగన్ కు లేఖ రాసిన ముద్రగడ ఇక ఆ తర్వాత నుంచి సైలెంట్ గా ఉంటున్నారు. గత టిడిపి ప్రభుత్వంలో కాపులను బీసీల్లో చేర్చుతామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చాలి అంటూ ముద్రగడ పెద్ద పోరాటం చేశారు. దీనికి కారణం అప్పటి సార్వత్రిక ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేరుస్తూ అంటూ చంద్రబాబు హామీ ఇవ్వడమే. ఆ హామీని నెరవేర్చాలని ముద్రగడ ఉద్యమానికి దిగారు. దీనిపై పెద్ద రాద్దాంతమే జరిగింది.

 

IHG

 కేంద్రం అగ్రవర్ణ పేదలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్ల లో కొంత కాపులకు కేటాయిస్తున్నట్లు ఎన్నికలకు ముందు ప్రకటించి చంద్రబాబు ఈ  వివాదానికి ముగింపు ఇద్దామని చూసినా ముద్రగడ శాంతించలేదు.ఈ  వివాదంలోకి వైసీపీ అధినేత జగన్ ను కూడా తీసుకువచ్చారు. కాపు రిజర్వేషన్ అంశం పై జగన్ స్పందన కూడా తెలియజేయాలని పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో కాపులకు తాను రిజర్వేషన్ ఇస్తానని చెప్పి చంద్రబాబులా మోసం చేయలేనని, రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని, అది కేంద్ర పరిధిలోని అంశం అని, కేంద్రం ఇస్తాను అంటే తమకు అభ్యంతరం లేదని, కానీ చంద్రబాబులా తమ పరిధిలో లేని అంశంపై తాను హామీ ఇవ్వలేను అంటూ జగన్ కుండబద్దలు కొట్టినట్లుగా ఈ విషయంపై తేల్చి చెప్పారు. 

 

IHG

 వైసిపి సార్వత్రిక ఎన్నికల్లో దెబ్బతింటుందని, ఎన్నికల్లో ఓటమి తప్పదు అని అందరూ భావించారు. కానీ జగన్ తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో జగన్ పై ఈ విషయంలో ఒత్తిడి తీసుకు వచ్చేందుకు కూడా ముద్రగడ కు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ముద్రగడ బిజెపిలో చేరబోతున్నారనే ప్రచారం జరిగినా, అది కూడా కార్యరూపం దాల్చలేదు. చేసింది లేక ప్రస్తుతానికి ముద్రగడ పూర్తిగా సైలెంట్ గా ఉంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: