జగన్ అధికారంలోకి వచ్చే ఏడాది కాబోతుంది. ఈ ఏడాది కాలంలో జగన్ పరిపాలన పట్ల దేశ వ్యాప్తంగా ఉన్నా నాయకులతో పాటు కేంద్రంలో ఉన్న నాయకులు కూడా శభాష్ అన్న సందర్భాలు ఉన్నాయి. జాతీయ మీడియా సైతం జగన్ పరిపాలన పట్ల తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పలు ఆసక్తికరమైన కథనాలు ప్రసారం చేస్తూ భవిష్యత్తులో ప్రధాని అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా కొన్ని వార్తా పత్రికలు ప్రచురితం చేశాయి. కరోనా వైరస్ విషయంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే జగన్ చాలా ముందుచూపుతో ఒకపక్క ప్రజలను కాపాడుతూనే మరోపక్క నిర్మొహమాటంగా కేంద్రానికి నిర్ణయాలు తెలపడంతో కేంద్ర పెద్దలు కూడా జగన్ కరోనా విషయంలో అవలంభించిన వైఖరికి ఇటీవల మెచ్చుకున్నారు.

 

ఇటువంటి సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం విషయం ఢిల్లీ దాకా వెళ్లిందట. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచడానికి శ్రీశైలం లో ఉన్న నీటిని చట్టపరంగా నిబంధనలకు అనుగుణంగా జగన్ వాడుకోవటానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవో జారీ చేయటం మనందరికీ తెలిసిందే. అయితే ఈ జీవో పై కేసీఆర్ చాలా దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అన్యాయమని న్యాయపోరాటం చేస్తామని దీనికి సంబంధించి అధికారులు కూడా అప్రమత్తం చేసినట్లు చెప్పుకొచ్చారు.

 

అయితే ఈ విషయం కేంద్రం దృష్టికి వెళ్లడంతో ఈ విషయంలో మనం కలుగ చేసుకోకుండా ఉండటమే బెటర్ అని... అన్యాయంగా జగన్ ఏమీ చేయడు. ఈ విషయంలో ప్రొఫెషనల్ గానే డీల్ చేసుకుంటాడు… మనం ఇన్వాల్వ్ అయిన కేసీఆర్ దాన్ని రాజకీయాలు చేస్తాడు అని కేంద్ర పెద్దలు అంటున్నారట. ఈ విషయం లో కేసిఆర్ న్యాయస్థానానికి వెళ్తానన్నాడు కాబట్టి కోర్టు… న్యాయం చెబుతుంది అప్పటి దాకా వెయిట్ చేయడం బెటర్ అన్ని అంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: